హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి.ముఖ్యంగా తెలుగు వారింట రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పిండి వంటలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్లతో సంబరాలు అంబరాన్ని అంటుకుంటాయి.
నేడు భోగి పండుగ.అంటే భోగ భాగ్యాలను తెచ్చే పండుగ.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ హడావుడి మొదలైంది.ఇక పండగ వచ్చిందంటే మగువలు అందంగా మెరిసిపోవాలని ఆశ పడుతుంటారు.
అలాంటిది పండగపూట చర్మం డల్ గా ఉంటే ఎక్కడలేని నిరుత్సాహం మన వెంటే ఉంటుంది.కానీ అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక పాటిస్తే క్షణాల్లోనే డల్ స్కిన్ ను దూరం చేసుకోవచ్చు.అదే సమయంలో అందంగా మరియు కాంతివంతంగా మెరిసి పోవచ్చు.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు టమాటో ముక్కలు, అర కప్పు బంగాళదుంప ముక్కలు, ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ములేటి పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని కలుపుకోవాలి.

చివరిగా సరిపడా టమాటో-పొటాటో జ్యూస్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని కనీసం ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే డల్ గా ఉన్న చర్మం క్షణాల్లో గ్లోయింగ్ గా మరియు యాక్టివ్ గా మారుతుంది.
పండగపూట చర్మం అందంగా ప్రకాశవంతంగా మెరిసిపోతుంది.మరియు చర్మం పై పేరుకుపోయిన మురికి , మృతకణాలు తొలగిపోతాయి.చర్మం తెల్లగా సైతం మారుతుంది.