ఓట్స్. వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.అద్భుతమైన ఫుడ్స్ లో ఓట్స్ ఒకటి.వాటిలో ఎన్నో అమోఘమైన పోషక విలువలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి.ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలని భావించే వారికి ఓట్స్ ఒక వరమనే చెప్పవచ్చు.
అలాగే నీరసం, అలసట వంటి వాటిని అడ్డుకోవడంలో ఓట్స్ ఎంతగానో సహాయపడతాయి.
ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే వెయిట్ లాస్ తో పాటు రోజంతా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఓట్స్ ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్ వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకుని అవి మునిగే వరకు బాదం పాలు పోసుకోవాలి.
ఇప్పుడు ఈ ఓట్స్ ను ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.మరుసటి రోజు ఫ్రిడ్జ్ లో నుంచి ఓట్స్ ను బయటకు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు తరిగిన బాదం ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు తరిగిన పిస్తా ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు తరిగిన వాల్ నట్స్, పది నల్ల ఎండు ద్రాక్ష వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్ల తేనె, అర కప్పు తరిగిన యాపిల్ ముక్కలు,
రెండు టేబుల్ స్పూన్లు వేయించిన గుమ్మడి గింజలు వేసి బాగా కలిపితే మన హెల్తీ అండ్ టేస్టీ ఓవర్ నైట్ ఓట్స్ సిద్ధమవుతుంది.బ్రేక్ ఫాస్ట్ లో ఈ విధంగా ఓట్స్ ను తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.అతి ఆకలి దూరమవుతుంది.
వేగంగా బరువు తగ్గుతారు.అలాగే ఈ విధంగా బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకోవడం వల్ల రోజంతా ఫుల్ యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంటారు.
నీరసం అలసట అన్న మాటే అనరు.