మన ఇండియన్ సినిమాల దగ్గర పండుగలు వస్తే చాలు.బాక్సాఫీస్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది.
ప్రతీ పండుగకు వరుసగా సినిమాలను రంగంలోకి దించేందుకు మేకర్స్ రెడీ అవుతూ ఉంటారు.ఇక మన సౌత్ ఇండియాలో సంక్రాంతి అంటే పెద్ద పండుగ అనే చెప్పాలి.
మరి పొంగల్ రేస్ ను స్టార్ హీరోలు అంత త్వరగా వదులుతారా.అస్సలు మిస్ చేసుకోరు.
మరి ఈసారి టాలీవుడ్ లో మాత్రమే కాదు.కోలీవుడ్ లో కూడా పొంగల్ రేస్ లో భారీ పోటీ నెలకొనింది.తమిళ్ లో విజయ్ దళపతి, అజిత్ కుమార్ ఒకేరోజు బరిలోకి దిగారు.సంక్రాంతి కానుకగా జనవరి 11న ఇద్దరు తమ సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేసారు.
ఈ రెండు సినిమాలు కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తునివు‘ సినిమాతో అజిత్ కుమార్ కూడా జనవరి 11న బాక్సాఫీస్ బరిలో దిగాడు.

ఇక ఈసారి అజిత్ సినిమా యూఎస్ లో కూడా అదర గొడుతుంది.దీంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.సాదరణంగా యూఎస్ మార్కెట్ లో అజిత్ కు అంత స్ట్రాంగ్ జోన్ గా ఉండదు.ఎప్పుడు ఇక్కడ తక్కువ కలెక్షన్స్ సాధించే అజిత్ ఈసారి మాత్రం ‘తునివు’ సినిమాతో అప్పుడే హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడానికి రెడీగా ఉంది.
త్వరలోనే అజిత్ కు ఇక్కడ అతిపెద్ద గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇక ఈ సినిమా తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పతాకంపై బోణీ కపూర్ నిర్మించారు.
మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది.అలాగే సముద్రఖని కూడా కీలక పాత్రలో నటించాడు.
మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాల్సిందే.







