వైసీపీ వ్యతిరేక ఓటును చీల నివ్వను అని ఎప్పటి నుంచో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు.దానికోసం రాష్ట్రం లోని ప్రతిపక్షాలు అన్నిటితో కలిపి రంగం లోకి దిగాలి అని చూస్తున్నారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలం లోనూ అదే సంకేతం ఇచ్చారు.తన ప్రసంగం తో జనాలను ఆలోచింప జేసెలా చేశారు.అయితే తన ప్రసంగం లో చెప్పినట్టు అయన అన్ని పార్టీలతో జతకడితే అది ఆయనకే నష్టం అని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే టీడీపీ తో పొత్తు దాదాపు ఖరారు ఐపోయింది.
ఇక మిగిలింది బీజేపీ.ఆ పార్టీ రాష్ట్ర నేతలు కూడా పొత్తుల పై కేంద్రం తో మంతనాలు జరుపుతన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ అదే నిజం అయితే జన సేన టీడీపీ తో.బీజేపీ కూడా కలుస్తుంది.ఇక్కడే ఇంకో మతలబు ఉంది.చాలా కాలంగా కమ్యూనిస్టుపార్టీ లు ఇక్కడ టీడీపీ నీ నమ్ముకొని ఉన్నాయి.పోయిన సారి ఎన్నికల్లో కూడా వ్యూహాత్మకంగా నే జన సేనతో జత కట్టారు.
టిడిపి అధినేత కనుసన్నల్లోనే ఏపీ కమ్యూనిస్ట్ నేతలు నడుస్తూ ఉన్నారు అనే పుకారు ఉంది.
అందులో భాగంగా నే.సీపీఐ రామకృష్ణ.వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీఓ నెంబర్ వన్ ను కూడా రద్దు చేయాలని న్యాయస్థానం తలుపు తట్టి రద్దు చేయించారు.కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీ లకు కూడా బాబు ఆశ్రయం కల్పించే అవకాశం ఉంది.
అదే జరిగితే బాబు విజయం సాధించడం దాదాపు ఖాయం అవుతుంది.జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలతో పాటు టీడీపీ కలిసి రంగంలోకి దిగుతాయి.

అయితే ప్రశ్నిస్తా అంటున్న జన సేన కు ఈ కూటమి వల్ల చాలా సీట్లు తగ్గే ఛాన్స్ ఉంది.అది గాక పవన్ ఒక్క ఛాన్స్ నినాదం ఇప్పుడిప్పుడే పని చేస్తూ ఉంది.ఇలా వన్ వర్సెస్ ఆల్ గా రాజకీయం మారితే.అది సింపతీ గా మారి జగన్ కు కలసి వస్తుంది.జన సేనకు ఉన్న పాపులారిటీ పడి పోతుంది.పవన్ తో కేవలం చంద్ర బాబు మాత్రమే రంగం లోకి దిగితే కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో కెసిఆర్ వర్సెస్ ఆల్ గా మారిన తర్వాత అవి కెసిఆర్ కు బాగా కలిసి వచ్చాయి.మరి దాని నుంచి గుణపాఠం నేర్చుకున్న చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాన్ని బట్టి పవన్ రాజకీయ భవిష్యత్తు ఆధార పడి ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.







