మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈయన మరోసారి ఆచార్య సినిమా గురించి కూడా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రస్తావించారు.గతంలో ఆచార్య సినిమా డిజాస్టర్ కావడానికి కొరటాల శివ కారణమంటూ మాట్లాడిన చిరంజీవి తాజాగా మరొక సారి కూడా ఈ సినిమా గురించి ప్రస్తావించారు.
వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక సినిమాకి డైరెక్టర్ కెప్టెన్ లాంటివారు అంటూ గతంలో చేసిన మాటలను కూడా గుర్తు చేసుకున్నారు.ఒక సినిమా నిడివి ఎంత ఉంటుంది ఆ సమయానికి తగ్గట్టు స్క్రిప్ట్ పూర్తిచేసి అంతకు మాత్రమే షూటింగ్ చేయాలని ఈయన తెలియజేశారు.
అలాకాకుండా రెండున్నర గంటల పాటు ఆడే సినిమాకి ఏకంగా నాలుగు ఐదు గంటలు సినిమా షూటింగ్ చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని చిరు తెలిపారు.

ఆచార్య విషయంలో ఇదే జరిగిందని సినిమా నిడివి మాత్రమే కాకుండా ఎక్కువ షూటింగ్ చేసే అనంతరం సినిమాని ఎడిటింగ్ చేయడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు.అయితే ఈ వ్యాఖ్యలు తాను కొరటాల శివని ఉద్దేశించి అనలేదని ప్రతి ఒక్క డైరెక్టర్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఈయన తెలిపారు.

రెండున్నర గంటలకు సరిపడే స్క్రిప్టు సిద్ధం చేసుకుని అది మాత్రమే షూటింగ్ చేస్తే హీరోలకు డేట్లు కలిసి వస్తాయి.నిర్మాతకు డబ్బు మిగులుతుంది… నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కూడా కాస్త డబ్బును సంపాదించుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







