ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది.రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్.1ను హైకోర్టు సస్పెండ్ చేసింది.ఈనెల 23 వరకు జీవో నెంబర్.1 పై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.కాగా జీవో నెంబర్.1 ను వ్యతిరేకిస్తూ సీపీఐ రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.







