హిడ్మా మృతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ పార్టీ లేఖ రాసింది.మావో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా సురక్షితంగానే ఉన్నాడని కేంద్ర కమిటీ లేఖలో పేర్కొంది.
హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదని మావోయిస్టు పార్టీ తెలిపింది.దక్షిణ బస్తర్ లో డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడులు చేశారన్నారు.
వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరేస్తామని అమిత్ షా అన్నారన్న మావో పార్టీ అందులో భాగంగానే మావోయిస్టులపై దాడులు చేస్తున్నారని వెల్లడించింది.అయితే, నిన్న బీజాపూర్ – తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్ జరిగింది.
భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతిచెందాడని పోలీసులు తెలిపారు.కాగా ఈ వార్తలను మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండిస్తూ ఓ లేఖను విడుదల చేసింది.







