రుచికరంగా పకోడీలు చేసిన తల్లి.. కొడుకుతో తినిపించేందుకు కష్టాలు

సిక్స్‌ ప్యాక్‌ల కోసం చాలా మంది యువకులు ఇటీవల కాలంలో ఎక్కువగా జిమ్‌లలో కష్టపడుతున్నారు.చక్కటి బాడీ షేప్ సాధించేందుకు చాలా శ్రమిస్తారు.

 A Mother Who Made Delicious Pakodis Struggled To Feed Her Son , Pakodi, Mother's-TeluguStop.com

ఎక్కువ స్థాయిలో వర్కవుట్లు చేస్తుంటారు.దాని కోసం ఫుడ్ లో కూడా మార్పులు చేసుకుంటుంటారు.

ఇష్టమైనవి తినకుండా నోరు కట్టేసుకుంటారు.మొలకెత్తిన గింజలు, గుడ్లు వంటివి ట్రైనర్ సూచన మేరకు తీసుకుంటుంటారు.

అయితే ఇళ్లలో ఒక్కోసారి అమ్మ చేసే రుచికరమైన వంటలు తినాలని నోరూరిస్తాయి.కానీ యువకులు తినకుండా ఆగిపోతారు.

కొన్ని సందర్భాలలో తల్లితో గొడవలు కూడా జరుగుతుంటాయి.ఇలాంటి ఓ మనసుకు హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనికి సంబంధించిన విషయాలిలా ఉన్నాయి.

ఫిట్‌నెస్ కోసం శ్రమించే వారంతా నోరు కట్టుకుని ఉండాలి.పిజ్జాలు, బర్గర్‌లు, మోమోలు, పకోడా, డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.ఇలాంటి ఇష్టమైన వాటన్నింటినీ ఆరోగ్యం కోసం చాలా మంది దూరం పెడతారు.

ఇలాగే ఓ యువకుడు జిమ్‌లో కష్టపడుతూ తన తల్లి చేసిన పకోడాలను తినడానికి నిరాకరించాడు.కానీ చివరికి వాటిని తినవలసి వస్తుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో తల్లి వంటగదిలో పకోడీలను తయారు చేస్తూ ఉంటుంది.ఇంతలో కొడుకు వంటగదిలోకి వెళ్లి తల్లితో మాట్లాడతాడు.‘మమ్మీ, నేను జిమ్‌కి వెళ్లడం మొదలుపెట్టాను.మీరు మళ్లీ నాకిష్టమైన మంచి ఆహారం వండటం మొదలుపెట్టారు’ అని అంటాడు.పకోడీ తినడం మానుకోమని ఎవరు చెప్పారని ఆమె తన కొడుకుని అడుగుతుంది.‘నీకు నా వయస్సు వచ్చినప్పుడు, ఇలాంటివి తినలేరు.ఇప్పుడు, మీరు ఎందుకు తినకూడదు’ అని అంటుంది.తాను చేసిన పకోడీలను కొడుకుతో చివరికి తినిపిస్తుంది.తొలుత మొండికేసినా తల్లి ఎంతో రుచికరంగా చేసిన పకోడీలను ఆ యువకుడు తినేస్తాడు.తల్లీకొడుకుల మధ్య జరిగిన సంభాషణతో కూడిన ఈ వీడయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనికి నెటిజన్లు స్పందిస్తున్నారు.తల్లి ప్రేమ అంటే ఇంతేనని, అది షరతులు లేనిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube