కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ బాధిత రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో విచారణ ఇవాళ్టికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే.తమను సంప్రదించకుండా పంట భూములను రిక్రియషన్ జోన్ గా ప్రతిపాదించడాన్ని సవాల్ చేస్తూ రామేశ్వర్ పల్లి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, మున్సిపాల్ కమీషనర్, మున్సిపల్ ఛైర్మన్ తో పాటు జిల్లా కలెక్టర్ లు ఉన్నారు.కాగా నేటి హైకోర్టు విచారణ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







