అల్లు కాంపౌండ్ వారి మరో చిన్న సినిమా.. ఈసారి సక్సెస్ కొట్టేలా ఉన్నారే!

అల్లు కాంపౌండ్ కు చెందిన గీతా ఆర్ట్స్ 2 నుండి బ్యాక్ టు బ్యాక్ చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఆ మధ్య వచ్చిన 18 పేజెస్ సినిమా పాజిటివ్ టాక్‌ దక్కించుకుని డీసెంట్ కలెక్షన్స్ ను నమోదు చేసిన విషయం తెల్సిందే.

 Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Releasing On Feb 17th,murali Kishor-TeluguStop.com

అందుకే ఈ బ్యానర్‌ నుండి రాబోతున్న వినరో భాగ్యము విష్ణుకథ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో అల్లు అరవింద్‌ < సమర్పణలో సినిమా అంటే కచ్చితంగా పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తుంది.

అందుకే ఈ సినిమా కు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేయడం జరిగింది.టీజర్ విడుదల తర్వాత సినిమా పై భలే ఉందే అంటూ అంచనాలు నమోదు అయ్యాయి.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలోని హీరో కిరణ్ అబ్బవరం పాత్ర ఉంటుందని దీన్ని బట్టి అర్థం అవుతుంది.

ఇక ఈ సినిమా ను బన్నీ వాసు నిర్మించగా అల్లు అరవింద్ పర్యవేక్షణ లో రూపొందించారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు ప్రస్తుతం సినిమా యొక్క ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.అల్లు అరవింద్‌ కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే సినిమా ను కమిట్‌ అయ్యాడు.ఈ సారి ఈ చిన్న సినిమా తో అల్లు వారి కాంపౌండ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా ను ఫిబ్రవరి 17వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.అయితే అదే తారీకున శాకుంతలం సినిమా విడుదల ఉన్న కారణంగా పరిస్థితి ఎలా ఉంటుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube