బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం అద్దేపల్లిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.ఓ మహిళ మృతదేహాన్ని నిందితుడు కిరేశ్ ఇంటి ముందు ఉంచిన గ్రామస్తులు నిరసనకు దిగారు.
నిందితుడే వచ్చి మహిళకు అంత్యక్రియలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.మృతురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కిరేశ్ మోసం చేసినట్లుగా సమాచారం.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.ఈ నేపథ్యంలో నిందితుడు కిరేశ్ ను పోలీసులు అరెస్ట్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.







