ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చ జరుగుతోంది.పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆయన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.
ఇందులో భాగంగా తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొగ్గూడెంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఫ్లెక్సీలపై సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కనిపించలేదు.
దీంతో ఆయన పార్టీ మారుతారనే వ్యాఖ్యలకు మరింత బలం చేకూరిందని చెప్పొచ్చు.బీఆర్ఎస్ నేతల ఫొటోలు పెట్టకపోవడంపై కార్యకర్తలతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.







