ఖమ్మం లో బీజేపీకి పొంగులేటి పనికి వస్తాడా..?

దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా తన జెండా.ఎజెండా ఉండాలి అనేది బీజేపీ స్ట్రాటజీ.

 Will Ponguleti Come To Work For Bjp In Khammam?khammam Politics, Ex Mp Pongulet-TeluguStop.com

అయితే దాని కోసం అన్ని రాష్ట్రాల్లో విస్తరించడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది.ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదలుకొని అటక్ నుంచి కటక్ దాకా.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వివిధ ప్రయత్నాలు చేస్తోంది.బీజేపీ కి తన మాతృ సంస్థ అయిన అర్ ఎస్ ఎస్ కూడా వెన్ను దన్ను గా నిలవడం తో అన్ని రాష్ట్రాల్లోనూ దూసుకు పోతుంది.

ఇక చాలా చోట్ల ఆ పార్టీ విజయ దుందుభి మోగించడానికి అర్ ఎస్ ఎస్ ఎంతగానో పని చేసింది.

త్రిపుర లాంటి కమ్యూనిస్ట్ కంచుకోటను కూల్చి కాషాయ జెండా ఎగురవేసి.

ఇప్పటికే అన్ని ఈశాన్య రాష్ట్రాలలోనూ పాగ వేసింది.అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లాంటి చోట్ల పార్టీలకు పార్టీలను విలీనం చేసుకొని.

తన సంఖ్య బలాన్ని పెంచుకుంది.ఇప్పటికే ఈశాన్య భారతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న బీజేపీ కన్ను ఇప్పుడు దక్షిణాది పై పడింది.

కర్ణాటక మినహా.ఎక్కడ బీజేపీ కి బలం లేదు.

దానికి చాలా స్థానిక కారణాలు ఉన్నాయి.

ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, రాష్ట్రాల్లో లోకల్ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంది.

దాంతో ఇక్కడ జాతీయ పార్టీల ప్రభావం పెద్దగా లేదు.అయితే బీజేపీ కి తెలంగాణలో మాత్రం ఆశలు చిగురిస్తు ఉన్నాయి.బీజేపీ కూడా ఊహించని విధంగా.2019 లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లు సాధించింది.దానికి తోడు బల్దియా ఎన్నికలు, హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు బీజేపీ కి ఉత్తమ ఇచ్చాయి.

Telugu Khammam, Latest, Ponguletibjp-Latest News - Telugu

ఇక అదే ఊపుతో.మునుగోడు ను టార్గెట్ చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు.నల్గొండ లాంటి కమ్యూనిస్ట్ కంచు కోటలో కమలం జెండాను పాతారు.

ఇక ఇప్పుడు మరో కమ్యూనిస్ట్ కంచుకోట పై ఫోకస్ పెట్టారు.అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ నీ పార్టీలోకి తీసుకొని.

జెండాను ప్రజల్లోకి తీసుకు వెళ్లారు.అదే స్ట్రాటజీ తో.ఖమ్మం లో పొంగులేటి నీ పార్టీ లోకి తీసుకొని.అక్కడ కూడా జెండా పాతాలని చూస్తోంది.

కమ్యూనిస్ట్ లు, కాంగ్రెస్ తప్పా.ప్రాంతీయ పార్టీ లు కూడా పెద్దగా ప్రభావం చూపని ప్రాంతం లోనూ దూసుకు పోవాలి అని చూస్తోంది.

Telugu Khammam, Latest, Ponguletibjp-Latest News - Telugu

మరి పొంగులేటి కేడర్ మొత్తం కషాయం కండువా కప్పుకుంటే.నిజంగా బీజేపీ బలపడి నట్టెనా.? అనే అనుమానాలు వస్తున్నా.వాటికి బీజేపీ చెక్ పెట్ట గలదు అనేది వాస్తవం.

ఇప్పటికే బీజేపీ మాతృ సంస్థ అర్ ఎస్ ఎస్ తన పని మొదలు పెట్టింది.బీజేపీ వేసిన పునాదిలో.

అర్ ఎస్ ఎస్ సునాయాసంగా మహా వృక్షాన్ని నాట గలదు.మరి ఖమ్మం, నల్గొండ జిల్లా ల్లోనూ అదే పని జరిగితే.

నిజంగా బీజేపీ కి ప్లేస్ అవుతుంది.మరి ఉమ్మడి ఖమ్మం లో బీజీపీ కి పొంగులేటి పనికి వస్తాడా లేదా అనేది తేలాలి అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube