తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కాగా సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది.ఇకపోతే సమంత 2021 లో తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.
ఇక ఆ సమయంలో వారిద్దరి విడాకుల వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో సంతులనంగా మారింది.అంతేకాకుండా వాళ్లు విడాకులు తీసుకుని విడిపోయిన తరువాత దాదాపు సంవత్సరం పాటు వారిద్దరికీ సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.
ఆ సమయంలో సమంత ఎన్నో రకాల వార్తలను అవమానాలను ఎదుర్కొంది.విడాకులు తీసుకుని విడిపోవడానికి సమంతానే కారణం అన్నట్టుగా ఆమెను దూషించడంతోపాటు విమర్శించారు.
అయినప్పటికి ఆ వార్తలన్నీ తట్టుకొని నిలబడింది.అయితే సమంత విడాకుల డిప్రెషన్ నుంచి బయటపడడానికి కొన్ని నెలల సమయం పట్టింది అన్న విషయం తెలిసిందే.ఆ బాధ నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది సమంత.ఆ సమస్య నుంచి బయటపడి ఆ బాధలన్నీ మరిచి పోయింది అనుకునే లోపే మయో సైటీస్ అనే వ్యాధి రూపంలో మరో బాధ ఆమెను వెంటాడింది.
అయితే సమంత ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది.అంతే కాకుండా సమంత ట్రీట్మెంట్ తో పాటు మానసిక ప్రశాంత కోసం ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు చెప్పిన విషయాలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది.సమంత ఎక్కడకు వెళ్లినా ఆమె చేతిలో జపమాల ఉంటుంది.సందర్భం ఏదైనా సమంత జపమాల వదలడం లేదు.
తాజాగా శాకుంతలం ట్రైలర్ విడుదల ఈవెంట్లో పాల్గొన్న సమంత జపమాల చేతిలో పెట్టుకొనే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఇటీవల సమంత ముంబై వెళ్లారు.ఎయిర్ పోర్టులో ఆమె కెమెరా కంటికి చిక్కారు.చేతిలో జపమాల ఉంది.ప్రయాణాలలో కూడా సమంత జపమాలను తోడుగా తీసుకెళ్తున్నారని తెలిసింది.మరో విషయం ఏమిటంటే ఆమె తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు.
అలాగే ఆమె ఆరోగ్యం కోసం, కెరీర్ కోసం, మానసిక ప్రశాంత కోసం కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నారుపిస్తుంది.ఆధ్యాత్మిక గురువులు చెప్పిన మాటలు ఆమె అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
కొందరు సమంత చేతిలో జపమాల ఆ తెల్లని దుస్తులు ధరించడం చూసి ఆమె సన్యాసం తీసుకోబోతుందేమో అందుకే ఇలా వాటినే వెంటబెట్టుకొని తిరుగుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు.