గుణశేఖర్.సమంత.
లాంటి అసాధ్యాలు ఒకే చోట కలిస్తే వచ్చిన అవుట్ ఫుట్ శాకుంతలం.కానీ శాకుంతలం ట్రైలర్ వచ్చాక ఏంటి బాహుబలి సెట్స్ అలాగే ఉంచేస్తే గుణ శేఖర్ వాడుకున్నాడా అనే అనుమానం కలిగింది చాల మందికి.
దుశ్యంత నగరం అనే పేరు పెట్టి మాషిష్మతిని కాపీ కొట్టినట్టు గా కనిపిస్తుంది.ఈ మాత్రం దానికి శాకుంతలం ఎందుకు చూడాలి అండి బాహుబలి చూసాం కదా అనుకోవచ్చు.
పైగా బాహుబలి లో తమన్నా కి వచ్చినట్టే సమంత ఎంట్రీ సీన్ లో సీత కోక చిలకలు ఎగురు తున్నాయి.
బాహుబలి ప్రభావం గుణశేఖర్ పై బాగానే కనిపిస్తుంది.
ఇక గుణ శేఖర్ కి ఎప్పటి నుంచో సెట్టింగ్స్ అంటే మహా ఇష్టం ఈ సారి గ్రాఫిక్స్ తో సరిపెట్టేసినట్టు ఉన్నాడు.బాహుబలికి మళ్లే ఒక యుద్దాన్ని పెట్టేసారు.
ఆ రాజులు, వారి ఆహార్యాలు, మరియు గెటప్స్ గాత్ర అంత అచ్చు గుద్దినట్టు దిగిపోయింది.అయినా ఒక ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉందో చెప్పేయడం కూడా సరి కాదు.
ఎందుకంటే మహా అద్భుతమైన ట్రైలర్స్ తో వస్తున్న సినిమాలు రెండో రోజు థియేటర్ లో ఉండటం లేదు.

ఇక శాకుంతలం చూసాక కానీ మనం సమంత ని, శాకుంతలానికి ఒక రిపోర్ట్ కార్డు ఇచ్చేయలేము.ఇక రాధే శ్యాం లో నుంచి కూడా ఒక పోలిక కొట్టచ్చినట్టు కనిపిస్తుంది.పాన్ ఇండియా సినిమా గా వచ్చింది కాబట్టి హిందీ లో మొదట సినిమా తీసి ఆ తర్వాత తెలుగు డైలాగ్స్ రాసినట్టు గానే శాకుంతలం సినిమాలో కూడా ఆ మార్కు కనిపిస్తూ ఉంది.
మరి కృత్రిమమైన పాదాలను చెప్పించినట్టు గా కూడా కనిపిస్తుంది.

మరి బాషా విషయం లో ట్రైలర్ తోనే ఇలా భయపెట్టేస్తే సినిమాతో ఎలా భయపెట్టబోతున్నారు అనేది చూడాలి మరి.కానీ ఒక్క విషయం లో గుణ శేఖర్ ని మెచ్చుకోకుండా ఉండలేం .సినిమాలో ఏ విషయం లోను అతడు రాజీ పడ్డట్టు గా అనిపించడం లేదు.మరి ఈ మధ్య వస్తున్న ఫైట్స్, కుమ్మేసుకోవడాలు కన్నా చాల బెటర్.సమంత లాంటి ఒక నటి కోసం అయినా థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే.ఐదు భాషల్లో వస్తుంది కాబట్టి నిర్మాత గట్టెక్కేయడం పెద్ద పనేమీ కాదు.







