ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ప్రతిపక్షాలను అరికట్టడానికి రకరకాల ఆంక్షలు విధిస్తున్నారని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు.
ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను వెలిక్కితీస్తున్న ప్రతిపక్షాలను రకరకాల జీవలతో కట్టడి చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే టీడీపి నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
చంద్రబాబునీ సొంత నియోజకవర్గం కుప్పంలో తిరగనియ్యనప్పుడు… తాడిపత్రి మున్సిపల్ వార్డుల్లో తనని ప్రభుత్వం తిరగనియ్యకపోవటం పెద్ద విశేషం కాదని చెప్పుకొచ్చారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరు దాదాగిరీ చేస్తున్నారని అన్నారు.
టైం ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకుందామని అనుకుంటున్నట్లు వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
బ్రిటిష్ కాలంలో మామూళ్ళు ఇవ్వలేక రాయల చెరువులోని బలపం పౌడర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.అని చెప్పుకొచ్చారు.ఫ్యాక్టరీల ఓనర్ లు మాత్రం ఎంతనీ ఇస్తారని పేర్కొన్నారు.
చాలామంది ఫ్యాక్టరీల యజమానులు నష్టాల్లో ఉన్నారని అన్నారు.రాష్ట్రంలో యధారాజా తథాప్రజా అన్నట్టు పరిస్థితులు నెలకొన్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.