సమయం లేదు మిత్రమా :  జిల్లా టూర్ లలో కేసీఆర్ బిజీ బిజీ 

బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత దేశ రాజకీయాల్లో ఎలా ఉన్న , తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి వ్యతిరేక దెబ్బలే తరుచుగా తగులుతున్నాయి.పార్టీలోని కీలక నాయకుల అనుకున్న వారందరూ ఒక్కొక్కరుగా ఇతర పార్టీలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు .

 No Time My Friend : Kcr Is Busy In District Tours ,kcr, Telangana, Trs, Brs, Kcr-TeluguStop.com

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో లేకపోవడంతో అన్ని పార్టీలు అలర్ట్ గానే ఉంటూ… చేరికలను పెద్ద ఎత్తున ప్రాచహిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణలో అధికారం సాధించేందుకు బిజెపి కాచుకుని కూర్చుంది.

బీఆర్ఎస్ లోని కీలక నాయకులందరినీ తమ పార్టీలో చేర్చుకునే వ్యూహానికి బీజేపీ సిద్ధం అయ్యింది.
  ఈ క్రమంలో కేసీఆర్ ముందుగా తెలంగాణలో తమ పార్టీ పట్టు సడలకుండా చేసుకుని, రాబోయే ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని, అప్పుడే దేశవ్యాప్తంగా బిజెపిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు.

దీనిలో భాగంగానే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.దీనిలో భాగంగానే రెండు రోజుల్లో మూడు జిల్లాల్లో పర్యటించేందుకు

కేసిఆర్ ఏర్పాట్లు చేసుకున్నారు.ఈనెల 12న రెండు జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు.12వ తేదీ ఉదయం మహబూబాబాద్ కలెక్టరేట్ ను,  అదే రోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్ ను కేసీఆర్ ప్రారంభిస్తారు.ఇక జనవరి 18న ఖమ్మం జిల్లా కలెక్టరేట్,  సమీకృత భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
 

ఇదే విధంగా ఇక వరుస వరుసగా జిల్లాలు,  నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ బీఆర్ఎస్ పట్టు సడలకుండా  ప్రయత్నం చేస్తూనే  దూకుడు ప్రదర్శిస్తూ చేరికలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో అసంతృప్త నాయకులను గుర్తించి వారిని బుజ్జగించేందుకు కేసిఆర్ జిల్లాల పర్యటనలోనే ఈ విషయాల పైన ప్రధానంగా దృష్టి సారించబోతున్నారట.తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ ఎస్ పట్టు సడలకుండా జాగ్రత్తలు కేసీఆర్ తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube