కాల గమనంలో 2022 సంవత్సరం కూడా కలిసి పోయింది.ఎన్నో కొత్త ఆశలు నమ్మకాలతో 2023 సంవత్సరం ప్రారంభం అయింది.
ఈ కొత్త సంవత్సరం లో తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.కొత్త సంవత్సరం లో ఇప్పటి వరకు పెద్ద సినిమాలు ఏమీ విడుదల కాలేదు.
మరో రెండు రోజుల్లో సంక్రాంతి సీజన్ ప్రారంభం కాబోతుంది.మొదటగా వారసుడు సినిమా తో ప్రేక్షకుల ముందుకు విజయ్ రాబోతున్నాడు.
అంతే కాకుండా దిల్ రాజు ఈ సినిమా నిర్మించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.ఆ తర్వాత వీర సింహా రెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమా లు బ్యాక్ టు బ్యాక్ ఒక్క రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ వద్ద దాడికి సిద్ధం అయ్యాయి.
తెలుగు సినిమా పరిశ్రమ 2023 పరిస్థితి ఏంటి అంటే వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాల ఫలితాలు ను బట్టి ఉంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.
ఈ రెండు సినిమాల్లో కనీసం ఒక్క సినిమా అయినా సక్సెస్ అయితే కచ్చితంగా టాలీవుడ్ కి మంచి జరుగుతుందని చాలా మంది ఆశిస్తున్నారు.
చిన్న సినిమాలు రెగ్యులర్ గా సక్సెస్ లను దక్కించుకుంటూనే ఉంటాయి.కానీ పెద్ద సినిమాలు మాత్రమే చాలా అరుదుగా సక్సెస్ అవుతున్నాయి.2023లో అయినా ఎక్కువ పెద్ద హీరోల సినిమాలు సక్సెస్ అవ్వాలని, భారీ బడ్జెట్ సినిమాల వసూళ్లు భారీ గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.2023 సంవత్సరం లో మొదటి భారీ చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారు అందిస్తున్నారు.

వీర సింహా రెడ్డి సినిమా జనవరి 12వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తారీఖున విడుదలకు సిద్ధం అయ్యింది.ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విషయాలను సొంతం చేసుకునే అవకాశం ఉందని ఆయా హీరోల అభిమానులు చాలా ధీమా తో ఉన్నారు.







