నా అందం వెనుక సీక్రెట్ అదే.. పెద్ద రహస్యం చెప్పేసిన మిల్కీ బ్యూటీ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం.

 Tollywood Star Heroine Tamannaah Beauty Secret Reveal Details, Tamannaah Bhatia,-TeluguStop.com

తమన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.టాలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్,కోలీవుడ్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.ప్రస్తుతం తమన్న తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

ఇకపోతే తమన్నా మూడు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.ఇండస్ట్రీకి ఎంట్రీ కొన్ని ఏళ్ళు పూర్తి అవుతున్న అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యంగ్ హీరోయిన్లకు పోటీని ఇస్తోంది.

అయితే చాలామంది అభిమానులు తమన్నా ఏం వాడుతుంది ఇంత అందంగా ఉంది అని అనుకుంటూ ఆమెను అనేక సార్లు ఇదే విషయం గురించి ప్రశ్నించారు.తన అందం సీక్రెట్ చెబుతూ గంధం, కాఫీ పొడి తేనె కలిపి ముఖానికి రాసుకుంటానని, అలాగే పెరుగు, రోజ్ వాటర్స్ టిప్స్ ని కూడా ఆమె తెలిపింది.

వాటితో పాటుగా తన తల్లి చెప్పిన బ్యూటీ సీక్రెట్స్ ని కూడా తాను పాటిస్తానని తెలిపింది తమన్నా.

Telugu Tamanna Fans, Tamanna, Tamannavijay, Tamannaah, Tamannah, Tamannah Secret

ఇకపోతే గత కొద్ది రోజులుగా తమన్నా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.తమన్నా హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో మునిగితేలుతోందని, త్వరలోనే వాళ్ళు పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు ఇంటూ ఇలా అనేక రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు ఆ వార్తలపై తమన్నా స్పందించలేదు.కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ వార్తలను నిజమే అనుకుంటున్నా పలువురు అభిమానులు తమన్నాను ప్రశ్నిస్తున్నారు.మరి తన ప్రేమ వివాదంపై పెళ్లి వార్తలపై తమన్న ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube