సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు ఎలాంటి వీడియోలు తారస పడతాయో ఎవ్వరమూ ఊహించలేము.అలా కనబడిన కొన్నింటిని మెచ్చుకోకుండా ఉండలేము.
కొన్నింటిని చూసినపుడు మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంటుంది.మనం చేయాల్సిన పనిని వేరెవరో చేస్తున్నారని చూసి ఆనందపడతాము.
ఈ క్రమంలోనే ఓ బస్సు డ్రైవర్ చేసిన చిన్న పని అందరి మనసులను దోచుకుంటోంది.మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ రోడ్లపై చాలా మంది చిన్నారులు ఆకలి బాధతో కనబడటం బాధాకరం.
అందుకేనేమో మనదేశం అంటే కొన్ని ఫారిన్ కంట్రీలకు లోకువ ఎక్కువ.
ఇక అలాంటి రోడ్డు సైడు నివసించే వారిని చూస్తే చాలా జాలి అనిపిస్తుంటుంది.
కానీ పరిస్థితుల వలన వారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు.అయితే ఆ బస్సు డ్రైవర్ అలాగని ఊరికే వుండలేదు.
అతని పని అతను చేసుకుంటూనే రోడ్డు పక్కన కనబడిన ఇద్దరు చిన్నారులను చూసి బస్సు ఆపి మరీ బిస్కెట్ ప్యాకెట్లు అందించాడు.ఆ సమయంలో ఎవరో ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వెలుగు చూసింది.
లేదంటే అతని వ్యవహారం ఎవ్వరికీ తెలిసేది కాదు.

అలాంటి దానకర్ణులు మన చుట్టూ ఎంతోమంది వున్నారు.అలాంటివారిని చూసి స్ఫూర్తి పొంది తోటివారికి సాయం చేస్తే ఎంతో బావుంటుంది.ట్రిప్స్ గ్రామ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా, ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
ఇకపోతే డ్రైవర్ చేసిన సాయం చిన్నదే అయినప్పటికీ ఆయన చిన్నారుల పట్ల చూపిన ప్రేమకు నెటిజన్లు అయితే ఫిదా అయిపోయారు.కాగా ఆ డ్రైవరు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణాలో పనిచేస్తున్నట్టు భోగట్టా.
కేరళలోని పథనంతిట్టా ప్రాంతం మీదుగా వెళ్తూ ఇద్దరు చిన్నారులను చూసిన ఆ డ్రైవరు తన వద్ద ఉన్న బిస్కెట్ ప్యాకెట్లను అందించాడు.







