ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో షఫీ ఏం చేసాడో తెలుసా ?

షఫీ.20 ఏళ్ల క్రితం ఖడ్గం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఈ సినిమా విజయవంతం కావడం తో షఫీ కి మంచి గుర్తింపు లభించింది.ఈ చిత్రం తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికి ప్రభాస్ సినిమా చత్రపతి లో, మహేష్ బాబు సినిమా ఖలేజా లో అద్భుతంగా నటించి మంచి నటుడుగా గుర్తింపు పొందాడు.20 ఏళ్ల నుంచి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ దాదాపు 50 సినిమాల వరకు మాత్రమే నటించాడు షఫీ.తాను చేసే సినిమాలో తనకు ఎంత ప్రాధాన్యత ఉందో అది మాత్రమే చూసుకొని నటిస్తూ వస్తుండటం తో ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు.షఫీ కేవలం క్యారెక్టర్ గా మాత్రమే కాదు ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు.

 Actor Shafi Hard Work For Khadgam Movie Details, Actor Shafi , Actor Shafi Hard-TeluguStop.com

హీరోయిన్ నందితా దాస్ నటించిన కమిలి అనే చిత్రంలో లీడ్ రోల్ పోషించాడు.

ఈ చిత్రం నేషనల్ అవార్డ్ దక్కించుకుంది.తిరుపతి దగ్గర చంద్రగిరి లో పుట్టి పెరిగిన షఫీ కెరియర్ మొత్తం పైన ఒక నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.

చిన్నతనం నుంచి నాటక రంగానికి అలాగే సినిమాకి ఎంతో ప్రభావితం అయ్యాడు, అయితే తిరుపతిలో ఎంతో ప్రయోగాత్మకంగా ఒక నాటక సంస్థ నెలకొల్పాలని ప్రయత్నించినప్పటికీ అది వీలు కాలేదు.దాంతో సినిమా పై ఉన్న ఇష్టంతో ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చేరాడు.

అక్కడ నుంచి ఖడ్గం సినిమాలో నటించేందుకు అవకాశం సంపాదించుకున్నాడు.ఖడ్గం సినిమాలో తీవ్రవాదిగా నటించడానికి షఫీ ఇంతవరకు ఏ నటుడు చేయని సాహసం చేశాడు.చార్మినార్ వీధుల్లో తన స్నేహితుడి ఇంట్లో ఒక నెల రోజుల పాటు అక్కడే నివాసం ఉండి, అక్కడి వారి అలవాట్లు బాగా అర్థం చేసుకొని ఆ తర్వాత ఖడ్గం సినిమాలో నటించడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పాలి.ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర కోసం అంత రిస్క్ చేసుకున్న నటుడు ఎవరు లేరనే చెప్పాలి.

అందుకే షఫీ పాత్ర బాగా క్లిక్ అయ్యింది.ఇక చివరగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించిన షఫీ మరికొన్ని సినిమాలతో అలరించబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube