బాలయ్య కాళ్లు మొక్కిన అభిమాని... హెయిర్ కట్ చేయాల అంటూ షాక్ ఇచ్చిన బాలయ్య!

నందమూరి నటసింహం అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీరసింహారెడ్డి అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఇక ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

 Balakrishna Fun With Fan In Veerasimhareddy Pre Release Event Details, Balakrish-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలయ్య అద్భుతమైన స్పీచ్ తో అదరగొట్టారు.ఇక ఈ వేడుకకు వందలాది మంది అభిమానులు తరలివచ్చారు.

ఇక వేదికపై బాలకృష్ణ మాట్లాడుతుండగా అక్కడ ఓ ఇన్సిడెంట్ జరిగింది.ఒక అభిమాని ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా సైలెంట్ గా వచ్చి బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో అతని పాదాలకు నమస్కరించారు.

అయితే ఆ అభిమాని వేదిక పైకి రావడానికి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా గమనించలేదు.ఇలా బాలకృష్ణ పాదాలకు అభిమాని నమస్కరించడంతో వెంటనే బాలయ్య ఏంటయ్యా హెయిర్ కట్ చేయాలా అంటూ ఫన్నీగా అడిగారు.

దీంతో అభిమాని తనకు మైక్ ఇవ్వాలని తాను మాట్లాడతానని కోరారు.

ఈ విధంగా బాలకృష్ణ మాట్లాడే సమయంలో అభిమాని మధ్యలో వచ్చే డిస్టర్బ్ చేసిన బాలకృష్ణ ఏ మాత్రం ఆవేశపడకుండా చాలా ప్రశాంతంగా ఇప్పుడు కాదు అంటూ తనని అక్కడి నుంచి వెళ్ళమని చెప్పాడు.ఇక అక్కడ ఉన్నటువంటి ఇతర చిత్ర బృందం తనని పక్కకు పంపించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube