ఈ మధ్యకాలంలో సాధారణంగానే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల నుంచి ఉపాధి కోసం చాలా దేశాల నుంచి వెళ్లి ఎంతో మంది స్థిరపడిపోతున్నారు.అలా వెళ్లిన దేశాల ప్రజలలో భారతదేశ ప్రజలు ఏ దేశంలో అయినా కచ్చితంగా ఉన్నారు.
న్యూజిలాండ్లో పెరిగిపోతున్న దోపిడీలు, నేరాలు అక్కడి భారతీయ వ్యాపారములను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.న్యూజిలాండ్ తమకు ఇక ఎంత మాత్రం సురక్షితం కాదని భారతీయ షాపు ఓనర్లు, వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడికి వచ్చి తప్పు చేశామని చాలామంది భారతీయులు బాధపడుతున్నారు.న్యూజిలాండ్ స్థానిక మీడియా ప్రకారం ఆక్లాండ్, హామిల్టన్ పరిసర ప్రాంతాలలో ఈ మధ్యకాలంలోని 24 గంటల వ్యవధిలో రిటైల్ షాపులలో చాలా దోపిడీలు జరిగినట్లు సమాచారం.
గురువారం తెల్లవారుజామున జరిగిన దోపిడీలో నిందితులు ఖన్నా శర్మ గ్యాస్ స్టేషన్ ను టార్గెట్ చేశారు.కారుతో షాపు తలుపులను ఢీ కొట్టి చేతికి అందినవి దోచుకుపోయారు.
దీనివల్ల షాపు యజమాని శర్మ తీవ్ర భయభ్రాంతులకు గురైనట్లు సమాచారం.ఇలాంటి దోపిడీ జరగడం ఇది మూడోసారి అని షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత సురక్షితమైన దేశాలలో న్యూజిలాండ్ ఒకటని నేను భావించాను.అది తప్పని ఇప్పుడు తెలుస్తోంది.
ఇక్కడికి వచ్చి తప్పు చేశాను అంటూ శర్మ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

పోయిన సంవత్సరం డిసెంబర్లో మరో భారతీయుడు నివసిస్తున్న షాపులో దొంగలు పడ్డారు.ఈ ఘటనలో బాధితుడు జయోష్ పటేల్ కు పదివేల డాలర్లు నష్టం జరిగింది.షాపు తలుపులు బద్దలు కొట్టి 50 డాలర్లు విలువైన సిగరెట్లు ఇతర వస్తువులు దోచుకుపోయినట్లు సమాచారం.
పగిలిపోయిన తలుపులను రిపేరు చేయించుకునేందుకు ఇప్పుడు పదివేల డాలర్లు ఖర్చు పెట్టవలసి వచ్చిందని షాపు యజమాని బాధ పడ్డారు.తమ చర్యలకు పర్యావసనాలు ఉండవన్న ధీమాతోనే నిందితులు నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఈ విషయంలో చట్టాలు బలహీనంగా ఉన్నాయని ఈ పటేల్ వెల్లడించారు.







