నందమూరి బాలకృష్ణ మరో సారి తన ఫ్యాన్స్ కి విందు భోజనం వంటి సినిమా ను వీర సింహా రెడ్డి తో ఇవ్వబోతున్నాడని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది.సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలకృష్ణ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అన్ని ఎలిమెంట్స్ అందించబోతున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా ధీమా తో చెబుతున్నారు.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తూ ఉంటే అభిమానులకు విందు భోజనం వంటి సినిమా లభించబోతుంది అనిపిస్తుంది.
కానీ సాధారణ ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? అభిమానుల కంటే సాధారణ ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటారు.
అభిమానులకు మాత్రమే నచ్చితే సినిమా వందల కోట్ల కలెక్షన్స్ నమోదు చేయడం కష్టం.
ఫ్యాన్స్ నుండి సాధారణ ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరికి కూడా వీర సింహా రెడ్డి సినిమా నచ్చాల్సి ఉంది.అప్పుడే భారీ గా కలెక్షన్స్ నమోదు అవుతాయి.
అభిమానులకు నచ్చే విధంగా ఉన్న వీర సింహా రెడ్డి సినిమా సాధారణ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది చూడాలి.

అఖండ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసింది.అంతకు ముందు బాలయ్య తీవ్ర నిరాశ లో ఉన్నాడు.వరుసగా ఫ్లాప్స్ చవి చూసి వచ్చాడు.
అఖండ సినిమా యొక్క సక్సెస్ ని వీర సింహా రెడ్డి కంటిన్యూ చేస్తాడా.ముందు ముందు బాలకృష్ణ సినిమాలకు వీర సింహా రెడ్డి ఒక పాయింట్ గా నిలుస్తుందా అనేది చూడాలి.
ప్రేక్షకులు వీర సింహా రెడ్డి సినిమా ను ఎంజాయ్ చేస్తే కచ్చితంగా ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేస్తుంది అనడంలో సందేహం లేదు.







