బాలయ్య కూడా మంచు వారిలా మారిపోతున్నాడా.. సెల్ఫ్‌ డబ్బా పై విమర్శలు

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలం లో మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణు మాదిరిగా మారి పోతున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో మంచు వారి ఫ్యామిలీ పై ఏ స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయో మనమందరం చూస్తున్నాం.

 Social Media Trolls On Balakrishna About Self Dubba , Balakrishna , Manchu Vish-TeluguStop.com

ముఖ్యంగా వారి ఓవర్ యాక్షన్‌ కారణంగా.సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, మోహన్ బాబు పై మంచు విష్ణు పదేపదే దేవుడు వీరుడు సూర్యుడు అంటూ ప్రశంసలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేయడం.

అంతే కాకుండా మోహన్ బాబు కూడా పదే పదే తన నటన గురించి, తన యొక్క గొప్పతనం గురించి.తన క్రమశిక్షణ గురించి చెప్పడం వల్ల నెటిజన్స్ వీరిని సోషల్ మీడియా ద్వారా ఓ రేంజ్ లో మీమ్స్ తో విమర్శిస్తున్నారు.

ఒకరి గొప్పతనం గురించి మరొకరు చెబితే గొప్పగా ఉంటుంది, కానీ నేను గొప్ప.నేను మాత్రమే గొప్ప అంటూ చెప్పుకుంటే వారిని విమర్శిస్తూ ఉంటారు.తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా అదే పని చేస్తున్నాడు.ఆయన నటించిన వీర సింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను సింహాన్ని నేనే గొప్ప, అందరిలోకి నేనే గ్రేట్ అన్నట్లుగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభిమానులకు సైతం మింగుడు పడడం లేదు.

మరి బాలయ్య ఇంత సెల్ఫ్ డబ్బా అవసరం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ ముందు ముందు ఇలాంటి సెల్ఫ్ డబ్బా కంటిన్యూ చేస్తే కచ్చితంగా ఆయన్ని మరో మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణు అంటూ విమర్శలు చేసే అవకాశం ఉందని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఎంత మాత్రం సరి కాదని అంటున్నారు.సింపుల్ గా ఉండే విషయాన్ని మెగా హీరోలను చూసి నేర్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు.మరి బాలయ్య దీనికి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube