విహారయాత్రలకు వెళ్లాలని చాలా మందికి ఉంటుంది.కొందరు వీలు కల్పించుకుని మరీ విహార యాత్రలకు వెళ్తుంటారు.
విదేశాల్లో అయితే వారాంతంలో, లేదా సెలవుల సమయంలో సముద్రంలో ఫిషింగ్ కోసం వెళ్తుంటారు.అలా బోట్లపై వెళ్లినప్పుడు సముద్రంలో ఎన్నో విశేషాలను చూస్తుంటారు.ఇదే కోవలో కాలిఫోర్నియాలోని టూరిస్ట్‌లకు ఇటీవల అరుదైన దృశ్యం కనిపించింది.35 అడుగుల పొడవున్న బూడిద రంగు తిమింగలం వారి బోటు వద్దకు వచ్చింది.దానికి రక్తస్రావం కావడంతో ఏదైనా గాయం అయిందని తొలుత టూరిస్టులు భావించారు.అయితే బోటు దగ్గరకు వచ్చిన ఆ తిమింగలం చివరికి బిడ్డని ప్రసవించింది.
మొదట అది ఒక సాధారణ వలస గ్రే వేల్‌గా కనిపించింది.అయితే, పడవ నెమ్మదిగా జంతువును సమీపించినప్పుడు, తిమింగలం పరిశీలకులు దాని ప్రవర్తనలో భిన్నమైన దాన్ని గమనించారు.
కొన్ని సెకన్లలో, ఒక తిమింగలం బిడ్డను కనింది.శీతాకాలం సమయంలో సాధారణంగా ఇవి అత్యంత చలిగా ఉంటే అలస్కా నుంచి వలస వెళ్తుంటాయి.
అలాగే అది వలస వెళ్తుందని తొలుత టూరిస్టులు అనుకున్నారు.అయితే అది తమ బోటు సమీపంలోకి వచ్చి బిడ్డను ప్రసవించడంతో అరుదైన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు.

ఈ దృశ్యం బోటు నుండి కేవలం కొన్ని మీటర్ల దూరంలో జరిగింది.చాలా మంది పర్యాటకులు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్‌లలో బంధించారు.సఫారీ సర్వీస్ ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియోను తమ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది.వీడియోలో, తల్లి తిమింగలం తన నవజాత శిశువును ఉపరితలంపైకి నెట్టడం చూడవచ్చు.
అప్పుడే పుట్టిన గ్రే వేల్ ఈత నేర్చుకుని తన తల్లితో బంధం ఏర్పరుచుకోవడం ప్రారంభించింది.కెప్టెన్ డేవ్స్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్ష కంటే ఎక్కువ వీక్షణలు వచ్చాయి.
చాలా మంది వినియోగదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.







