సాధారణంగా క్యాన్సర్ అన్న పేరు వినగానే చాలామంది భయంతో వణికిపోతూ ఉంటారు.ప్రాణాల మీద ఆశతో ఏం జరుగుతుందో అని అనుక్షణం టెన్షన్ పడుతూ ఉంటారు.
క్యాన్సర్ వచ్చింది అంటే పెద్దవారు సైతం భయపడుతూ ఉంటారు.కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక చిన్నారి మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అని చెప్పవచ్చు.
అంతే కాకుండా ఆ చిన్నారి ధైర్యానికి ముందు చూపుకి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే.
ఒక నాలుగేళ్ల చిన్నారికీ క్యాన్సర్ ఉంది అని తెలిసిన భయపడకుండా ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారు అని ఆలోచించి ప్లీజ్ డాక్టర్ అమ్మ నాన్నలకు ఆ విషయం చెప్పొద్దు అంటూ ఒక డాక్టర్ ని ప్రాధేయపడ్డాడట.
ఇదే విషయాన్ని ఒక డాక్టర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఆ కథ విన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెడుతున్నారు.ట్విట్టర్ లో ఈ విధంగా రాసుకోచ్చాడు ఒక డాక్టర్.
కొన్ని నెలల క్రితం భార్యాభర్తలు ఆరేళ్ల వయసున్న బాలుడుతో తన దగ్గరికి వచ్చారని, బాలుడిని బయటే పెట్టి మొదట తనను కలిశారని, బాలుడికి క్యాన్సర్ ఉన్న విషయాన్ని ఆ చిన్నారితో చెప్పొద్దు అని ఆ తల్లిదండ్రులు డాక్టర్ని ప్రాధేయపడ్డారట.తర్వాత బాబు ని లోపలికి తీసుకురాగా అన్ని మెడికల్ టెస్టులు చేసిన తర్వాత చిన్నారికి గ్లయోబ్లాస్టోమా మల్టీ ఫార్మీ అనే ఒక ప్రమాదకరమైన మెదడు క్యాన్సర్ నాలుగో దశలో ఉంది అని వైద్యుడు గుర్తించారట.

అయితే ఆ బాలుడు కేవలం కొన్ని నెలలు మాత్రమే బతుకుతాడని నాకు మాత్రమే తెలుసు.క్యాన్సర్ కారణంగా కుడి చేయి కుడి కాలు పక్షవాతం వచ్చింది.కొద్దిసేపటి తరువాత ఆ బాలుడు తన తల్లిదండ్రులకు బయటకు వెళ్ళమని చెప్పి ఆ డాక్టర్ తో మాట్లాడుతూ.సార్ నేను ఈ వ్యాధి పేరును ఐప్యాడ్ లో టైప్ చేసి అసలు విషయం ఏంటో తెలుసుకున్నాను.
నేను ఆరు నెలల కంటే ఎక్కువ కాలం బతకడం అని తెలుసు.ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పలేదు.చెబితే వారు తట్టుకోలేరు ప్లీజ్ డాక్టర్ మీరు కూడా చెప్పొద్దు అని ఆ బాలుడు డాక్టర్ ని వేడుకున్నాడట.చిన్నారి విన్నపాన్ని మన్నించిన ఆ డాక్టర్ సరే నేను చూసుకుంటానని ఆ బాలుడికి చెప్పి బాలుని బయటకు పంపించి అనంతరం అతని తల్లిదండ్రులతో జరిగింది మొత్తం వివరించి బాలుడికి అలా ఉందని మీకు తెలియనట్టుగానే ప్రవర్తించాలి అని చెప్పాడట.

అలా ఆ తల్లిదండ్రులు బాలుడుతో 9 నెలల పాటు ఆనందంగా గడిపాడట.తొమ్మిది నెలల తర్వాత మళ్లీ ఆ తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరకు రాగా అప్పుడు ఆ డాక్టర్ తల్లిదండ్రులను వాళ్ళ బాబు గురించి అడగగా నెల క్రితమే వారిని వదిలిపోయి వెళ్ళిపోయినట్లు చెబుతూ బాధపడ్డారట.అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు ఇద్దరు వారి కొడుకు కోసం ఎనిమిది నెలల పాటు ఇద్దరూ ఉద్యోగలకు సెలవులు పెట్టి మరి ఆ పిల్లాడితో గడిపామని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ డాక్టర్ తో బాధపడ్డారట.ఈ కథని విన్న చాలా మంది పాపం చిన్నారికి ఎంత కష్టం వచ్చిందో అంటూ వారి బాధను వ్యక్తపరుస్తున్నారు.
ఇంకొందరు అయితే ఆ కథ విని కన్నీరు పెట్టాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







