సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని రకాల వీడియోలు చూసినపుడు ఒకింత చిరాకు, కోపం, అసహనం కలుగుతాయి.ఈ క్రమంలో అలాంటి ఫీట్లకు పాల్పడిన వారిని చూస్తే వారు తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అనేటువంటి సందేహాలు కలగక మానవు.తాజాగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియోని చూస్తే అలాంటి సందేహాలు కలగక మానవు.చాలా మంది లైఫ్ థ్రిల్‌గా ఎంజాయ్ చేయాలని వారికి కాని పనిని చేస్తూ వుంటారు.
మరి రోటిన్‌గా జీవిస్తే అందులో కిక్కేముంది అని అనుకుంటారో ఏమో గాని….వారి చర్యలను చూసినపుడు అవసరమారా? అని అనాలనిపిస్తుంది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే, థ్రిల్‌ను అనుభవించాలని ట్రక్ ఎక్కిన కొంతమంది ప్రజలు.తృటిలో ప్రమాదం నుంచి బయటపడటం మనం చూడవచ్చు.
వివరాల్లోకి వెళితే, వైరల్ అవుతున్న వీడియోలో ట్రక్‌పై నిలబడి చాలా మంది నిలబడి ఒక కొలనులోకి దిగడం మొదలు పెట్టారు.అయితే ఆ కొలనులో నీటి శాతం మొదట ఎంతున్నాయో ఎవ్వరికీ తెలియదు.
వెళ్లే ముందు అందరికీ టాటా చెబుతూ.సంతోషంగా వెళ్లారు.
అయితే కొన్ని సెకన్లలో ట్రక్ ముందుకు సాగి చిత్తడి నేలలోకి దిగబడిపోతుంది.దాంతో సంతోషిస్తున్నవారిలో ఒక్కసారిగా కంగారు కనిపిస్తుంది.

కట్ చేస్తే, ట్రాక్ నిటారుగా ఆ కొలనులోకి ఒరిగిపోతుంది.ఈ క్రమంలో కొందరు బురద నీటిలోకి పడిపోకుండా ట్రక్‌ను గట్టిగా పట్టుకుని వేలాడుతున్నారు.డ్రైవర్ కూడా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు.అలాగే బురదలో పడిన వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకుంటున్నారు.అయితే కొలను లోతు ఎక్కువగా లేకపోవడంతో వారు బతికిబట్టకలిగారు.లేదంటే అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే! కాగా సదరు వీడియోని నీటిజన్లు చూసి ‘అన్ని రోజులు మనవికావు’ మిత్రులారా అని హెచ్చరించడం మనం కామెంట్లలో చూడవచ్చు.







