కొంతమంది అనవసర విషయాలను ప్రస్తావించి అభాసుపాలు అవుతుంటారు.దీనివల్ల కలిసి వచ్చేది కంటే జరగబోయే నష్టమే ఎక్కువ ఉంటుంది.
ఇక రాజకీయాల్లో ఉన్న వారైతే ఆచితూచి మరీ వ్యవహరించాలి.లేకపోతే జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది.
ఇప్పుడు ఇదే విధంగా వ్యవహరించి విమర్శలు ఎదుర్కొంటున్నారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే క్రమంలో మెగా బ్రదర్స్ అందరు పైన కామెంట్లు చేశారు.
సొంత ఊరికి, సొంత జిల్లాకు వారు ఏమి చేయలేకపోయారని, ఈ ముగ్గురిని సొంత జిల్లా ప్రజలు ఓడించారని, మెగాస్టార్ చిరంజీవి , నాగబాబు , పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి రోజా విమర్శలు చేశారు.దీనిని బట్టి వీరి ముగ్గురికి రాజకీయ భవిష్యత్తు లేదనేది స్పష్టం అవుతుంది అని వ్యాఖ్యానించారు.
అయితే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్, ఆయన మరోసాదరుడు నాగబాబు ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు.కానీ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ఆయన అందరివాడిగా ముద్ర వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు.అంతేకాదు ప్రస్తుత వైసిపి ప్రభుత్వం పైన జగన్ పైన చిరంజీవి సానుకూలంగా స్పందిస్తున్నారు.
ఇప్పటికే రెండుసార్లు తాడేపల్లికి వచ్చి మరి జగన్ ను కలిశారు.ఈ సందర్భంగా జగన్ పనితీరును చిరంజీవి ప్రశంసించారు.
ఎక్కడా వైసీపీకి వ్యతిరేకంగా ఆయన కామెంట్లు చేయడం లేదు.అయినా ఇప్పుడు రోజా చిరు పేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం వైసిపికి నష్టం అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

వివాదాలకు, రాజకీయాలకు దూరంగా చిరంజీవి ఉంటున్నారు.పూర్తిగా సినిమా వ్యవహారాలపైనే ఆయన దృష్టి పెట్టారు.అయినా చిరంజీవి పేరును ప్రస్తావించి రోజు విమర్శలు చేసి వైసీపీకి నష్టం చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.చిరంజీవి రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా.ఆయనపై ఎవరికి వ్యతిరేకత లేదు.కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయనపై ఎటువంటి అవినీతి మరకలు లేవు.
అదీ కాకుండా కాపు సామాజిక వర్గం చిరంజీవిని దైవంగా భావిస్తూ ఉంటారు.ఇప్పుడు అనవసరంగా చిరు పేరును రోజా తెరపైకి తీసుకొస్తుండడం కాపుల్లో వైసీపీ పై మరింత వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







