ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ర్యాలీలు మరియు సభలు నియంత్రించడంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.ఇక ఇదే సమయంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయనను పోలీసులు అడ్డుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల టీడీపీ తలపెట్టిన కందుకూరు, గుంటూరు సభలలో 11 మంది చనిపోవడంతో ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ తీసుకురావడం తెలిసిందే.పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు శవాల నాయుడు అంటూ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.చంద్రబాబు తప్పులు చేస్తే పవన్ నోటికి ప్లాస్టర్ వేసుకుంటాడు.కందుకూరులో ఎనిమిది మంది గుంటూరులో ముగ్గురు చనిపోతే పవన్ ఎందుకు మాట్లాడలేదు.? ఇప్పటంలో ఇళ్ళ కూల్చివేత బాధితులకు నష్టపరిహారమిచ్చిన పవన్.చంద్రబాబు సభల్లో చనిపోయిన 11మందికి ఎందుకు పరిహారం ఇవ్వలేదని ప్రశ్నించారు.కనీసం వాళ్లను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు.ఇళ్లకు ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు లేవా.? అని మంత్రి రోజా.పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు తప్పులు చేస్తే పవన్ నోటికి ప్లాస్టర్ వేసుకుంటాడు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.







