ఏపీలో అమలవుతున్న విద్యా విధానంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.విజయవాడలో గురువారం హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానం గురించి సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది.

 In That Regard, The Key Comments Of Ap Mundanja Minister Botha In The Country ,-TeluguStop.com

ఈ సందర్భంగా నైపుణ్య అభివృద్ధికి సంబంధించి 17 కోర్సుల పాఠ్యపుస్తకాలను అందజేశారు.అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ… కళాశాలలో చదువు ముగించుకుని బయటకు వచ్చిన విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు స్కిల్ డెవలప్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో మంత్రివర్గంలో ఒక ప్రత్యేక పోర్టు ఫోలియో కూడా పెట్టినట్లు స్పష్టం చేశారు.

దేశంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుందని పేర్కొన్నారు.

ఏపీ విద్యార్థులు గ్లోబల్ స్టూడెంట్ అనిపించుకోవటం ముఖ్యమని పేర్కొన్నారు.అందువల్లే విద్యా విధానంలో ఆంగ్ల మధ్యమం ఇంకా ఇతర కోర్సులు ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు.రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.విద్యపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి సంక్షేపం మాత్రమే కాదు దానిని వినియోగించుకుని విద్యార్థులు అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి బొత్స సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube