సమంత-రష్మిక స్థానాలను కబ్జా చేసిన శ్రీలీల-మృణాల్!

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు కథానాయికల కొరత ఉంటూనే ఉంటుంది.వారానికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్న వారిలో అందరికి లక్ కలిసి రాదు.

 Srileela And Mrunal Thakur In Samantha Rashmika Place , Srileela, Mrunal Thakur,-TeluguStop.com

వచ్చిన ప్రతీ కొత్త కథానాయిక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం.అయితే కొంత మంది మాత్రం మొదటి సినిమా తోనే అదృష్టం కలిసి వస్తుంది.

మరి కలిసి వచ్చిన హీరోయిన్ లనే హీరోలు వరుసగా రిపీట్ చేస్తూనే ఉన్నారు.

మరి ఇప్పుడు మన టాలీవుడ్ లో వినిపించే ముద్దుగుమ్మలు ఎవరంటే.

పూజా హెగ్డే, రష్మిక మందన్న.వీరిద్దరూ కాకపోతే సమంత పేర్లు మాత్రమే స్టార్ హీరోల సినిమాల్లో వినిపిస్తున్నాయి.

వీరిలో పూజా ఎంత క్రేజ్ ఉన్న నటన పరంగా ఎక్కువ వైట్ మోయలేదు అంటారు.అలాగే రష్మిక అందం, నటన రెండింటిలోనూ అదర గొడుతున్న ప్రెజెంట్ ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్ మీదనే ఉంది.

ఇక సమంత డైవర్స్ తర్వాత సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తూ వస్తుంది.దీంతో స్టార్ హీరోలు సైతం కొత్త హీరోయిన్స్ గురించి అడుగుతున్నారు.ఈ క్రమంలోనే అందం, అభినయంతో ఈ మధ్య కాలంలో ఆకట్టుకున్న హీరోయిన్ లలో శ్రీలీల, మృణాల్ ఠాకూర్ ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు.వీరిద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకుని అందరి మనసులను కట్టిపడేసారు.

శ్రీలీల ఇటీవలే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి స్వింగ్ లో ఉంది.దీంతో శ్రీలీల వరుస ప్రాజెక్టుల మీద సైన్ చేస్తూ పోతుంది.అలాగే మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో మంచి సక్సెస్ దక్కించుకుంది.ఈమె ఈ సినిమా తర్వాత నాని సరసన ఒక ఛాన్స్ దక్కించుకుంది.ఇంకా రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది.సో ఈ లెక్కన రష్మిక, పూజా, సమంత వంటి ముద్దుగుమ్మల ప్లేస్ లో శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వచ్చేసారు అనే చెప్పాలి.

చూడాలి ముందు ముందు స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటారో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube