తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి దర్శకద్రుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో మల్టీ స్టార్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా గత ఏడాది మార్చి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసినందుకుగాను దర్శకుడు రాజమౌళి ఎంతోమంది హాలీవుడ్ దర్శకుల పై ప్రశంసలు కురిపించారు.
అదేవిధంగా ఈయనకు న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ ఉత్తమ దర్శకుడిగా అవార్డును కూడా ప్రకటించింది.ఇలా అమెరికాతోపాటు జపాన్లో కూడా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాని అతి పెద్ద స్క్రీన్‌లు ఉన్న థియేటర్లుగా లాస్ ఏంజిల్స్‌లోని ఐమాక్స్, చైనీస్ థియేటర్లు రికార్డ్‌లు క్రియేట్ చేసింది.
ఆర్ఆర్ఆర్ సినిమాను అక్కడ ప్రీమియర్‌గా ప్రదర్శించారు.
ఈ ప్రీమియర్ షో కోసం టికెట్లు బుకింగ్ ఓపెన్ చేయగానే కేవలం అతి తక్కువ సమయంలో హౌస్ ఫుల్ కావడం విశేషం.టికెట్లు ఓపెన్ అయిన 98 సెకండ్లలోని ఏకంగా 932 టికెట్లు అమ్ముడుపోయాడట.ఈ విధంగా అతి తక్కువ సమయంలోనే హౌస్ ఫుల్ బోర్డు ఏర్పడటంతో ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది.
ఇక ఇదే విషయాన్ని బియాండ్ ఫెస్ట్ అనే అంతర్జాతీయ సంస్థ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ… ఇదొక అద్భుతమైన చరిత్ర చైనిస్ థియేటర్, ఐమాక్స్‌లో 98 సెకన్లలో టికెట్లన్నీ బుక్ అయిపోయాయ్.ఇంత వరకు ఏ ఇండియన్ సినిమా విషయంలోను జరగలేదు.
ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమా తరహాలో ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదని ట్వీట్ చేసింది.ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ విషయం తెలిసి చిత్ర బృందంతో పాటు మెగా నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.