Shriya Saran: శ్రియా శరణ్… ఇష్టం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.
సంతోషం, నేనున్నాను, అర్జున్, నువ్వే నువ్వే, ఛత్రపతి వంటి హిట్ సినిమాలలో నటించారు.తెలుగులో సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ జత కట్టిన శ్రియా సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు లవర్ బాయ్ తరుణ్ లాంటి హీరోలకు జోడీగా నటించారు.
2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్‌ని శ్రియా రహస్యంగా పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే.ఇక గర్భవతి అయిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన శ్రియా.గతేడాది అక్టోబర్‌లో కూతురు పుట్టిందని ప్రకటించి అందరికి పెద్ద షాక్ ఇచ్చారు.ఓ వైపు భర్త ఆండ్రీ కొస్చీవ్, కూతురు రాధతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్నారు.
థియేటర్లలోకి వచ్చిన ఆమె చివరి చిత్రం దృశ్యం2.శ్రియా తదుపరి ప్రాజెక్ట్ కబ్జా. ఇందులో ఆమె సౌత్ సూపర్ స్టార్స్ ఉపేంద్ర మరియు సుదీప్‌లతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది.
శ్రియా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉన్నారు.నిత్యం రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు.తాజాగా అజా భారతదేశంలోని ప్రముఖ మల్టీ-డిజైనర్ లగ్జరీ ఫ్యాషన్ ప్లాట్‌ఫారమ్ (Aza Fashions) లో హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూ కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో శ్రియా శరణ్ సోషల్ మాధ్యమం ఖాతాను ప్రేక్షక మహాశయులకు అధిక సంఖ్యలో వీక్షించడం 1లక్ష వరకు Like చేస్తూ ఇప్పటికీ 3.8M మిలియన్లు పైచిలుకు ఫాలోవర్స్ తను ఖాతాని ఫాలో అవుతున్నారు.గార్జియస్ శ్రియా శరణ్ నటించిన @azafashions మ్యాగజైన్‌ను ప్రదర్శిస్తోంది.అజా యొక్క సెలబ్రేషన్ కోసం మ్యూజ్‌గా శ్రియా శరణ్ వర్క్ చేశారు.వారి ప్రత్యేక ఇంటర్వ్యూలో, శ్రియ తన భర్త ఆండ్రీతో తన మీట్-క్యూట్, తన ఆలోచన గురించి మరెన్నో వివరాలను వెల్లడించింది.