నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ క్రేజీ సినిమా ‘వీరసింహారెడ్డి’.ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా నందమూరి ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
మరీ ముఖ్యంగా బాలయ్య యాక్షన్ సినిమాలను ఆడియెన్స్ అంతా బాగా ఇష్టపడతారు.
ఇటీవలే అఖండ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇలాంటి యాక్షన్ సినిమాను మర్చిపోక ముందే మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా రాబోతున్నాడు.”వీరసింహారెడ్డి” ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే స్పీడ్ పెంచేశారు.
మరి ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయడానికి టీమ్ అంతా సిద్ధం అవుతుంది.మరి ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఫిక్స్ చేయగా ఆ ప్లేస్ ను ఇప్పుడు చేంజ్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ వేదికను చివరి నిముషంలో మార్చేసి ఇప్పుడు మరో వేదికను సిద్ధం చేస్తున్నట్టు టాక్.ఒంగోలు లోని అర్జున్ ఇన్ఫ్రా దగ్గర వేదిక ఫిక్స్ చేయగా అక్కడ పనులు కూడా శరవేగంగా జరిగి పోతున్నాయి.
తాజాగా దీనికి సంబంధించిన పిక్స్ బయటకు రాగ అవి కాస్త వైరల్ అయిపోయాయి.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.మరి సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాల్సిందే.







