రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన ధమాకా సినిమా తో రవితేజ స్టార్ డమ్ మరింత పెరిగింది అనడంలో సందేహం లేదు.
చాలా కాలం తర్వాత రవితేజ సాలిడ్ కమర్షియల్ బ్రేక్ ను దక్కించుకున్నాడు.ఆ మధ్య రవితేజ కెరీర్ ఖతం అయ్యింది.
ఆయన సినిమాలు హిట్ అవ్వవు.ఆయన సినిమాల్లో హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తే బాగుంటుంది అంటూ కొందరు సలహాలు ఇస్తూ వచ్చారు.
కానీ రవితేజ మాత్రం నమ్మకంతో సినిమాల్లో హీరో గా మాత్రమే చేశాడు.ఆయన ధమాకా సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకుని తన స్థాయి ఏంటో మరో సారి రవితేజ అభిమానులకు చూపించే ప్రయత్నం చేశాడు.
భారీ ఎత్తున ధమాకా సినిమా సాధించిన వసూళ్ల నేపథ్యం లో రవితేజ పారితోషికం అమాంతం పెరిగినట్లుగా సమాచారం అందుతోంది.

ఆయన ప్రస్తుతం చేస్తున్న రావణసుర మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కాకుండా ఆ తర్వాత చేయబోతున్న సినిమా లకు ధమాకా తాలూకు ఎఫెక్ట్ పారితోషికం పై పడబోతుంది అంటున్నారు.ధమాకా సినిమా కు ఆయన తీసుకున్న పారితోషికం తో పాటు భారీ ఎత్తున లాభాల్లో వాటాను కూడా దక్కించుకున్నాడు అంటున్నారు.ఆ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఇక ధమాకా సినిమా యొక్క పారితోషికంతో పోల్చితే ముందు ముందు చేయబోతున్న సినిమాల యొక్క పారితోషికాలు అందుకు రెట్టింపు ఉండబోతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.రావణసుర మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమా లు సక్సెస్ అయితే కచ్చితంగా పారితోషికం విషయం లో రవితేజ టాప్ 10 లో చేరినా ఆశ్చర్యం లేదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రావణసుర సినిమా ఈ సమ్మర్ లో రానుండగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇదే ఏడాది ద్వి తీయార్థంలో రాబోతుందట.








