చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పెద్దూరులో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులతో చంద్రబాబు వాగ్వివాదానికి దిగారు.ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో -1 ప్రకారం రోడ్ షో, సభలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.
ఇందులో భాగంగానే రోడ్ షో కు అనుమతి లేదని చంద్రబాబుకు డీఎస్పీ నోటీసులు ఇచ్చారు.ఓ వైపు పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు.
మరోవైపు పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తన నియోజకవర్గానికి కూడా వెళ్లినివ్వరా అంటూ డీఎస్పీపై మండిపడ్డారు.
రోడ్ షో ఎందుకు పర్మిషన్ ఇవ్వారంటూ ప్రశ్నించారు.ఇంతమంది ప్రజానీకాన్ని ఇబ్బంది పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ముందుకు వెళ్లనివ్వాలని పట్టుబట్టారు.
దీంతో పెద్దూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.







