ఆ సమయంలో చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను.. చిరంజీవితో డ్యాన్స్ పై శృతిహాసన్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Shruti Haasan Reveal Shooting Waltair Veerayya Song France Details, Waltair Veer-TeluguStop.com

ఈ సినిమాలో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే ఇందులో మెగాస్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు సాంగులకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.గాడ్ ఫాదర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇప్పటిక ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఇందులో నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా.పాటను ఫ్రాన్స్ లోని మంచు కొండల్లో చిత్రీకరించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇదే విషయాన్ని మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ శృతిహాసన్ స్పందిస్తూ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.ఆ సాంగ్ షూటింగ్ సమయంలో మైనస్ డిగ్రీల చలి ఉందని, ఆ పాట కోసం శారీలో ఆ వాతావరణంలో డాన్స్ చేయడం తనకు ఇబ్బందిగా అనిపించింది అని చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ.కానీ అభిమానుల కోసం చేయాల్సింది అని తెలిపింది.

ఇప్పటికే మెగాస్టార్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలోని పాటలు కూడా ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్నాయి.

ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతికి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటించిన గత రెండు సినిమాలు ఊహించని విధంగా ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు ఈ సినిమాపై బోలెడన్ని ఆశలను పెట్టుకున్నారు.ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమా కంటే ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఊహించుకుంటున్నారు.

కాగా ఆచార్య సినిమాతో పాటు సంక్రాంతికి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.మరొకసారి చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి పోటీపడనున్నారు.

మరి ఈ సినిమాలలో ఏది హిట్టు ఏది ప్లాప్ అవుతుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube