ఈ సంక్రాంతికి మన తెలుగు సినిమాలతో పాటు తమిళ స్టార్ హీరోలు విజయ్ మరియు అజిత్ లు నటించిన సినిమా లు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.రెండు సినిమా లు కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల నడు విడుదల కాబోతున్నాయి.
చిరంజీవి మరియు బాలకృష్ణ ల సినిమా లకు పోటీ అన్నట్లుగా ఆ రెండు సినిమా లు మన టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.పరాయి భాష యొక్క హీరోలు మన వద్ద సందడి చేస్తున్నారు.
కానీ మన హీరోలు మాత్రం తమిళ బాక్సాఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.వాల్తేరు వీరయ్య సినిమా ను హిందీ లో విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కానీ ఇప్పటి వరకు తమిళ రిలీజ్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇక బాలయ్య వీర సింహారెడ్డి సినిమా యొక్క నేటివిటీ అస్సలు తమిళంకు సెట్ అవ్వదు అంటున్నారు.
కనుక అక్కడ ఈ రెండు సినిమాలు విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.కానీ వారి సినిమా లు మాత్రం మన వద్ద తెగ హడావుడి చేస్తున్నారు.
బాక్సాఫీస్ ను షేక్ చేసే విధంగా అక్కడి సినిమా లు ఇక్కడ ఆడుతున్నాయి కానీ మన సినిమా లు మాత్రం అక్కడ విడుదల కావడం లేదు.విజయ్ మరియు అజిత్ లతో పాటు పలువురు తమిళ హీరోలు మరియు స్టార్ దర్శకులు తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు.
ఇక అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా అజిత్ మరియు విజయ్ ల యొక్క సినిమా లు ఉంటాయని ఇక్కడి ప్రేక్షకులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడి సినిమాలు మన వద్ద ఉన్నప్పుడు ఇక్కడి సినిమా లు కూడా అక్కడ ఆడాలి కదా అంటూ కొందరు లాజిక్ తీస్తున్నారు.మన సినిమా లను వారు పట్టించుకోనప్పుడు వాళ్ల సినిమా లను మనం ఎందుకు చూడాలి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ముందు ముందు ఈ వ్యవహారం చాలా దూరం వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.







