నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతి కి వీర సింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.వీర సింహారెడ్డి సినిమా కు పోటీగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతి కి రాబోతుంది.
ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.మెగాస్టార్ చిరంజీవి సినిమా కు సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చిందంటూ మెగా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో వాల్తేరు వీరయ్య సినిమా యొక్క సెన్సార్ రిపోర్టు అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు.ఈ సమయం లో నందమూరి బాలకృష్ణ అభిమానులు వీర సింహారెడ్డి సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు ఎప్పుడు పూర్తి అవుతాయి అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విశ్వసనీయంగా మాకు అందుతున్న సమాచారం ప్రకారం మరో మూడు రోజుల్లో వీర సింహారెడ్డి సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాబోతున్నాయి.ప్రస్తుతం చివరి దశ నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగం గా జరుగుతున్నాయని.
ఒకటి రెండు రోజుల్లో ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా సంతృప్తి చెందితే అప్పుడు సెన్సార్ కార్యక్రమాలు జరుగుతాయి అంటూ సమాచారం అందుతుంది.వీర సింహారెడ్డి సినిమా కు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.

శృతి హాసన్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.బాలకృష్ణ మరియు శృతి హాసన్ కాంబినేషన్ లో పాటలు సినిమా పై అంచనాలను పెంచాయి.ఇక బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్ర లో ఈ సినిమా లో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తోంది.అఖండ సినిమా తర్వాత బాలయ్య నుండి రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఈ సంక్రాంతికి మా బాలయ్య విన్నర్ అంటూ అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు.







