తెలంగాణా రాష్ట్రమే ధ్యేయంగా పార్టీ నీ స్థాపించి సక్సస్ అయిన సీఎం కెసిఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల పై ఫోకస్ చేశారు.దాంతో దేశ వ్యాప్తంగా పార్టీని స్థాపించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు.
అందుకోసం ఏకంగా పార్టీ పేరు మార్చేశారు.అంతే కాదు దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి.
దేశం లోని అన్ని నియోజక వర్గాల్లో brs జెండా పాతాలని చూస్తున్నారు.సంక్రాంతి తర్వాత దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.
దాంతో ఇక కెసిఆర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడని అంతా అనుకుంటూ ఉన్నారు.
అయితే ఇక్కడే రాజకీయ విశ్లేషకులు ఇంకో లా చెబుతు ఉన్నారు.
సీఎం కేసిఆర్ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించాలి అంటే.ఆయనకు ఒక బేస్ కావాలి.
అది తెలంగాణ లో తన పార్టీ అధికారం లో ఉన్నన్ని రోజులు మాత్రమే సాధ్యం అవుతుంది.ఒకవేళ అసలుకే మోసం వచ్చి ఇక్కడ పార్టీ అధికారం కోల్పోతే అయన పక్క రాష్ట్రాల సంగతి ఏమో గానీ ఉన్న చోట విలువ కోల్పోతారు.
దానికి తోడు.తెలంగాణ సెంటిమెంట్ కూడా మెల్లిగా కనుమరుగు అవుతోంది.ఒకవేళ అది పూర్తిగా పోతే.కెసిఆర్ పార్టీ కూడా.
అధికారం నుంచి దూరం కావాల్సి వస్తుంది.అందుకే ఆ పరిస్థితి రాకూడదు అంటే.
తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడూ పోకూడదు.అందుకే ఏపీలో పార్టీ పెట్టి.
అక్కడ స్విచ్ వేసి తెలంగాణ లో పబ్బం గడుపుకోవాలి అని చూస్తున్నట్టు తెలుస్తోంది.

సీఎం కెసిఆర్ ఏపీ కి వెళ్తే.అక్కడ ఏదో ఒక అవమానం.గానీ, ప్రతి ఘటన గానీ ఎదురు అవుతుంది.
అప్పుడు దాని ప్రభావం తెలంగాణ పై పడే ఛాన్స్ ఉంది.అప్పుడు సీఎం కెసిఆర్ పై సానుభూతి తో.తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ పుంజుకుంటుంది.ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ఇండియా పాకిస్తాన్ గొడవ జరిగి.
ఇరు వైపులా పార్టీలు ఎలా అధికారాన్ని సదిస్తాయో.అలాగే ఏపీ ను బుచిగా చూపించి.
తెలంగాణ లో ఫలాలు అందుకోవాలని ప్లాన్ చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.మరి నిజంగా కేసిఆర్ ప్లాన్ అదేనా.? కదా తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.







