తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నప్పుడు. గవర్నర్ నరసింహన్ కు.
ముఖ్యమంత్రి కేసిఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉండేది.అంతేనా.
ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే వెంట బెట్టుకుని మరి వెళ్ళేవారు.అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి.
ప్రభుత్వ కార్యక్రమాల వరకు అన్నిటికీ గవర్నర్ నరసింహన్ తోనే ప్రారంభించే వాడు.ఇక కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా మరి.అప్పట్లో మర్రి చెన్నా రెడ్డి కి.జయలలితకు ఉప్పు నిప్పులా ఉండేది.ఇప్పుడు సేమ్ సీన్ ఇప్పుడు తెలంగాణాలో రిపీట్ అవుతోంది.అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది.అక్కడ తమిళ సీఎం.తెలంగాణ గవర్నర్.
ఇక్కడ తమిళ గవర్నర్ తెలంగాణ సీఎం అంతే తేడా.
అప్పట్లో జయ లలితా ఎన్ని బిల్లులు పంపిన.
వాటిని చెన్నారెడ్డి అటక మీద పెట్టినట్టు.ఇప్పుడు కేసిఆర్ పంపిన బిల్లులన్ని గవర్నర్ తమిలిసై పక్కన పెడుతున్నారు.
తెలంగాణ పై కేంద్రం ఫోకస్ పెట్టిన దగ్గర నుంచి గవర్నర్ సీఎం ల మద్యన గ్యాప్ పెరుగుతూ వచ్చింది.అది కాస్తా రాజకీయ విమర్శలు చేసే స్థాయి దాటి.
ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు పిలవకుండా వుండే దాకా పోయింది.దాంతో ఆమె స్వంతంగా ప్రజా దర్బార్ పెట్టీ కెసిఆర్ కు ఝలక్ ఇచ్చింది.

ఇక బీజేపీలో పొలిటికల్ లీడర్ గా ఎదగడం తో.మొదటి నుంచి అదే దారిలో ఆమె నడుస్తోంది.కేసిఆర్ సైతం ప్రతి విషయం లో ఆమెను పక్కన పెడుతూ వచ్చారు.ఇప్పుడు కెసిఆర్ జాతీయ రాజకీయాలు లోకి అడుగు పెట్టడం తో ఈ గ్యాప్ మరింత పెరిగింది.
ఇప్పుడు ఏకంగా ఆమె ను చన్సులర్ పదవి నుంచి తప్పించ డానికి ప్లాన్ చేశారు.నిజంగా చాన్సులర్ పదవి నుంచి తప్పిస్తే.అగౌరవ పరిచి నట్టు ఉంటుంది.అది అల్టిమేట్ గా బీజేపీ ను కట్టడి చేసినట్టు అవుతుంది అనేది కెసిఆర్ ప్లాన్.
అయితే అసెంబ్లీ చేసే బిల్లు చట్టం కావాలంటే.దాని పైన సంతకం చేయాల్సింది గవర్నరే.
మరి ఆమె మెడకు అమే ఉచ్చు బిగించు కుంటారా అనేది అనుమానమే.చూడాలి మరి.ముందు ముందు తెలంగాణ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయి అనేది.







