టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన చిరంజీవి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని ఇండస్ట్రీలో అందరూ భావిస్తారు.అభిమానుల కోసం ఎంతో ఖర్చు చేసే చిరంజీవి కుటుంబ సభ్యులకు ఎలాంటి కష్టం రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే.
తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సమాచారం.ఈ ఇంటి విలువ ఏకంగా 35 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
కూతురిపై ఉన్న మమకారంతో చిరంజీవి ఈ ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చినట్టు బోగట్టా.ప్రస్తుతం తను హీరోగా తెరకెక్కుతున్న సినిమాల నిర్మాతల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్లతో చిరంజీవి శ్రీజకు ఈ ఇంటిని బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఈ ఇంటిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని సమాచారం.పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భావించి చిరంజీవి ఈ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.
గతంలో చెల్లెళ్లకు స్థలాలను బహుమతిగా ఇచ్చిన చిరంజీవి కూతురికి కూడా ఖరీదైన కానుక ఇవ్వగా నాన్న ఇచ్చిన బహుమతిని చూసి శ్రీజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సమాచారం అందుతోంది.రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న నేపథ్యంలో చిరంజీవి ఆదాయంపై ఆధారపడాల్సిన అవసరం చరణ్ కు లేదు.
ఈ కారణం వల్ల చిరంజీవి సైతం తను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని కూతుళ్ల కోసమే ఖర్చు చేయనున్నారని సమాచారం అందుతోంది.67 సంవత్సరాల వయస్సులో కూడా చిరంజీవి వరుసగా సినిమాల్లో నటిస్తూ ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తుండటం మెగా ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.మరోవైపు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మరోసారి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ హవా ఏంటో తెలుస్తుందని చెప్పవచ్చు.