థియేటర్స్ లో ప్రతి వారం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయితే మరికొన్ని సినిమాలు ఓటిటిలో విడుదల అవుతూ ఉంటాయి.
అలాగే ఈ వారం కూడా థియేటర్లలో, ఓటీటీ సందడి చేయడానికి కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.కాగా జనవరి తొలి వారంలో ఏకంగా 18 సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి.
అయితే ఈ వారం ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు అలాగే హిందీ సీరియల్స్ లో ఎక్కువగా ఉన్నాయి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే చాలామంది ప్రేక్షకులు ఈవారం సినిమాలు అనగానే బాలయ్య చిరు విజయ్ లాంటి హీరోలు నటించిన సినిమాలేమో అని అనుకుంటూ ఉంటారు.
అయితే అవి కాదండోయ్ వాటికి ఇంకా రెండు వారాల సమయం ఉంది.
ఈవారం ఓటీటీ, థియేటర్లో విడుదల చేయనున్న ఆ 18 సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కాగా ఈ వారం నెట్ ఫిక్స్ లో జనవరి 1న లేడీ వోయర్ అనే ఇంగ్లీష్ సిరీస్ విడుదల కానుంది.
జనవరి 4న ద లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్ అనే ఇటాలియన్ వెబ్ సిరీస్, అలాగే స్టార్ వార్స్ బ్యాండ్ బ్యాచ్ సీజన్ 2 కూడా విడుదల కానుంది.ఇక జనవరి 5వ తేదీన ఉమెన్ ఆఫ్ ది డెడ్ సిరీస్ తో పాటుకోపెన్ హాగన్ కౌబాయ్ డానిష్ సినిమా సైతం విడుదల కానుంది.
జనవరి 6వ తేదీన ముంబయి మాఫియా: పోలీస్ vs అండర్ వరల్డ్ సిరీస్ విడుదల కానుంది.ఇకపోతే జీ5లో విడుదల కానున్న సినిమాల విషయానికొస్తే.
ఊంచాయ్ అనే హిందీ సినిమా, షికాపుర్ బెంగాలీ సిరీస్, అదేవిధంగా బేబ్ భంగ్డా పౌండే అనే పంజాబీ మూవీ కూడా జనవరి 6న విడుదల కానుంది.ఇకపోతే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయ్యే వెబ్ సిరీస్ల విషయానికి వస్తే.తాజా ఖబర్ అనే వెబ్ సిరీస్ జనవరి 6న విడుదల కానుంది.అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోల సినిమాల వెబ్ సిరీస్ల విషయానికి వస్తే.జనవరి 2న ఫోన్ బూత్ అనే హిందీ మూవీ విడుదల కానుంది.సోనీ లివ్ లో విడుదల కానున్న సిరీస్ లు సినిమాల విషయానికొస్తే.
జనవరి రెండవ తేదీన ఫాంటసీ ఐలాండ్ సీజన్ 2, షార్క్ ట్యాంక్ సీజన్ 2 లు విడుదల కానున్నాయి.జనవరి 3వ తేదీన స్టోరీ ఆఫ్ థింగ్స్ తమిళ సిరీస్, నవంబర్ 13 హిందీ సిరీస్, జహనాబాద్ అనే హిందీ సిరీస్ లు విడుదల కానున్నాయి.
త్రీ సీస్ తెలుగు సినిమా జనవరి 6న విడుదల కానుంది.అలాగే సౌదీవెళ్లక్క అనే మలయాళ సినిమా జనవరి 6న విడుదల కానుంది.