వామ్మో.. వైరల్ అవుతున్న హీరో అఖిల్ లుక్.. చిరుత పులి అనుకున్నాం కానీ అలా ఉన్నావంటూ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో, అక్కినేని వారసుడు అఖిల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నాగార్జున, అమల కొడుకుగా అఖిల్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.

 Hero Akhil Akkineni Looks Stunning In Six Packs Body Viral Pic Details, Hero Akh-TeluguStop.com

చిన్న వయసులోనే సిసింద్రీ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.సమయంలో అతను వయసు కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే.

ఇక ఆ సినిమాలో అఖిల్ ను చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.ఆ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.

ఈతరం ప్రేక్షకులు కూడా ఆ సినిమాను బాగా ఇష్టపడతారు.

తర్వాత అఖిల్ పెరిగి పెద్ద వాడై దేశాలలో తన చదువులు పూర్తి చేసి 2014లో మరోసారి ఇండస్ట్రీకి రిఎంట్రీ ఇచ్చాడు.2014లో డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన మనం సినిమాలో చివర్లో క్లైమాక్స్ లో మాత్రమే కనిపిస్తాడు.ఆ తర్వాత 2015 లో అఖిల్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.

వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేక పోయింది.

ఆ తర్వాత ఆటాడుకుందాం రా సినిమాలు అతిధి పాత్రలో కూడా చేశాడు అఖిల్.ఇక 2017లో హలో సినిమాలో నటించగా ఈ సినిమా కొంతవరకు పరవాలేదు అన్నట్లుగా టాక్ తెచ్చుకుంది.ఆ తర్వాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో నటించగా ఈ సినిమాలు కూడా అఖిల్ ను నిరాశపరిచాయి.

దీంతో  సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.

మామూలుగా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో అడుగుపెడితే వాళ్లకు వెంటనే స్టార్ హోదా అనేది వస్తూ ఉంటుంది.

కానీ అఖిల్ కి మాత్రం సరైన సక్సెస్ కూడా లేకపోయింది.ప్రస్తుతం ఆయన ఖాతాలో ఏజెంట్ సినిమా ఉండగా ఆ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.

ఇక అఖిల్ ఆశలు అన్ని ఈ సినిమా పైనే ఉన్నాయి.ఇక ఈ సినిమా కూడా ప్లాఫ్ అయితే మాత్రం అఖిల్ కు హీరోగా కలిసి రానట్లే అర్థం.

అఖిల్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.అప్పుడప్పుడు తన ప్రాజెక్టు అప్డేట్ ల గురించి షేర్ చేస్తూ ఉంటాడు.కొన్ని కొన్ని సార్లు తన ఫోటోలు కూడా పంచుకుంటూ ఉంటాడు.ఇక ఈమధ్య బాగా వర్కౌట్లు చేస్తూ జిమ్ బాడీని సంపాదించుకున్నాడు.అయితే తాజాగా తన సిక్స్ ప్యాక్ ఫోటో ను చూపించాడు అఖిల్.

ఆ ఫోటోను తన ఇన్ స్టా వేదికగా పంచుకోగా ఆ ఫోటోని చూసిన అఖిల్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

మరి కొంతమంది ఆయన బాడీని చూసి షాక్ అవుతున్నారు.చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక ఓ అభిమాని మాత్రం.చిరుత పులి అనుకున్నాం కానీ నువ్వు సింహం లా ఉన్నావు దేవరా అంటూ పొగిడారు.

ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube