పైప్‌బోట్స్ రోబోల గురించి విన్నారా? ఒక్కబొట్టు నీరు కూడా లీకేజి కాకుండా చూసుకుంటాయట?

ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే, ఇక్కడి నీటి వనరుల శాతం 4% మాత్రమే.నీటి వనరులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వృథా కూడా ఎక్కువగానే జరుగుతోంది.

 Pipebots Robot Detect And Stop Water Leakages In Pipes Details, Robots, Cleanin-TeluguStop.com

నీటిని సరఫరా చేసే పెద్దపెద్ద పైపు లైన్లు పగలడం, వాటర్ లీక్ అయినపుడు జనాలు వాటిపై పెద్దగా బాధ్యత తీసుకోకపోవడం వంటి కారణాలవలన నీరు వృథాగా పోతూ ఉంటుంది.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పైపు లీకుల వల్ల సుమారు 40% వరకు నీరు వృథాగా పోతోందని సర్వేలు చెబుతున్నాయి.

ఇక సరిగ్గా బ్రిటన్‌లో కూడా ఇలాంటి సమస్యే ఏర్పడటం వలన ప్రతి ఏడాది కోట్ల లీటర్ల నీరు వృథాగా పోతోంది.

ఈ సమస్యకు పరిష్కారంగా చిన్నచిన్న ‘మినియేచర్’ రోబోలను ఇంజినీర్లు తయారు చేశారు.

పెద్దపెద్ద పైపుల్లో ఈ చిన్న రోబోలు తిరుగుతూ లీకులను పసిగట్టి రిపేర్ చేస్తాయి.రోబోల సాయంతో పైపు లైన్ల నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా నిర్వహించొచ్చని సదరు ఇంజినీర్లు చెబుతున్నారు.

ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు నీటి వృథాను అరికట్టే రోబోలను డెవలప్ చేయడం మీద వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాయని ‘వాటర్ యూకే’ అనే సంస్థ తాజాగా ఓ మీడియా వేదికగా పేర్కొంది.

నీటి సరఫరా వ్యవస్థను ప్రైవేటు రంగానికి అప్పగించిన తరువాత ప్రస్తుతం నీటి వృథా అత్యంత తక్కువగా ఉన్నట్లు కూడా చెబుతోంది.నీటి సరఫరా వ్యవస్థల్లో మినీ రోబోలు ఒక విప్లవాన్ని సృష్టిస్తాయని, నీటి వృథాను అరికడతాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.‘ఎసెక్స్ అండ్ సఫోక్ వాటర్’ సంస్థ ఇప్పటికే రోబోలను పరీక్షిస్తోంది.

నీటి పైపులకు మరమ్మతులు చేయాలంటే చాలా వరకు నేలను తవ్వాల్సి ఉంటుంది.దాంతో పని డబల్ అవుతోంది.

కాగా ఈ మినీ రోబోల సాయం తీసుకుంటే అలాంటి డామేజ్ అనేది ఉండదు.కాగా షెఫీల్డ్ యూనివర్సిటీలోని ICAIR (ఇంటిగ్రేటెడ్ సివిల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ సెంటర్) కొత్తతరం రోబొటిక్ పైప్ పాట్రోలర్స్‌ను పరీక్షిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube