ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతీ చిన్న విషయానికి తెగ కలవరపడిపోతున్నారు.రోజురోజుకూ కొత్త శత్రువుల పైన సేటైర్లు వేస్తూ ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఆంధ్రాలో తన బీఆర్ఎస్ పార్టీనీ విస్తృతం చేయాలని భావించిన కేసీఆర్ పైన పేర్ని నాని చేసిన విమర్శలు గురించి తప్పక మాట్లాడుకోవాల్సిందే.ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుండి కరెంటు దొంగలించన దొంగలు అని చెప్పడం గమనార్హం.
అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల గురించి మాట్లాడుతూ ఒక పార్టీ ఏ రాష్ట్రంలోకైనా వెళ్లి ప్రచారం చేసుకోవచ్చని అలాగే కెసిఆర్ కూడా అలాగే 175 స్థానాల్లో తమ అభ్యర్థులను పెట్టుకొని పోటీ చేయవచ్చని అందులో తప్పేమీ లేదని…
కాకపోతే కేఏ పాల్ కూడా ఇలాగే పోటీ చేశారని ఇక్కడ కేసీఆర్ పరిస్థితి కూడా అంతే అని ఎద్దేవా వేశారు.ఇక కెసిఆర్ ఎంపీ మల్లారెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లో కెసిఆర్ పాలన వస్తుందని ఇక్కడ అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది అని అంతేకాకుండా పూర్తి స్థాయిలో విజయం సాధింస్తుంది అన్న మాటలకు కూడా నాని బదులిచ్చాడు.
చివరి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే పోటీ చేసి నవ్వులపాలు అయ్యారు అన్నాడు.అంతేకాకుండా తెలంగాణ ఎంపీ మల్లారెడ్డి “పోలవరం పూర్తి కాలేదు, ప్రత్యేక హోదా రాలేదు” ఇవన్నీ కేసీఆర్ పాలనలో సాధ్యం అవుతాయి అని వ్యాఖ్యానించగా దీనిపై నాని తీవ్రంగా మండిపడ్డారు.
అసలు వీటన్నింటికీ కారణం ఒకరకంగా కెసిఆర్ అని… కొన్ని విషయాలు మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారని అడిగారు.అయినా ఏపీ ప్రభుత్వం ఆ సమర్థతకు కేసిఆర్ ఎలా కారణం అవుతారో ఎవరికి అర్థం కాలేదు.ఇలాగే వైసిపి నాయకులు మొదటి నుండి అర్థం పర్థం లేకుండా ఎవరు రాష్ట్రంలో వీరి చేతకానితనం గురించి మాట్లాడినా… ఇలాగే విరుచుకుపడడం షరామాములు అయిపోయింది.ప్రజలకు కూడా వైసిపి మంత్రుల మాటలు తెగ బోర్ కొట్టేసాయి.
మరి రానున్న ఎన్నికల్లో ఇదేవిధంగా లాజిక్ లేని విమర్శలు చేస్తే మాత్రం జగన్ అధిపత్యానికి పెద్ద గండి పడడం ఖాయం.!