నిర్మల్ జిల్లా బాసరలో బంద్ కొనసాగుతోంది.బాసర అమ్మవారిపై రేంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలను నిరసనగా బంద్ చేపట్టారు.
ఈ మేరకు బాసరలోని వ్యాపారులు, స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.రేంజర్ల రాజేశ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఇటీవల అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.







