ఈ మధ్యకాలంలో హీరోయిన్లు హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు.ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో హీరోలకు తామేమి తక్కువ కాదంటూ డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలలో నటిస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడంలో నయనతార సమంత అనుష్క వంటి వారు ముందు వరుసలో ఉంటారు.
ఇకపోతే తాజాగా నయనతార కనెక్ట్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున హోర్డింగ్ లను ఏర్పాటు చేశారు .అయితే ఒక నెటిజన్ కనెక్ట్ సినిమా హోర్డింగ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఒక హీరోయిన్ సినిమాకు ఈ స్థాయిలో హోర్డింగ్ ఏర్పాటు చేయడం చూసి చాలా ఆశ్చర్యపోయాను.పది సంవత్సరాల క్రితం హీరోయిన్లకు ఇలాంటి స్థాయి లేదని అయితే ఇప్పుడు హీరోయిన్లు కూడా హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే ఈట్వీట్ పై మరో క్రేజీ హీరోయిన్ సమంత స్పందించారు.ఈ సందర్భంగా సమంత ఈ ట్వీట్ పై స్పందించి మహిళలు ఎదుగుతున్నారు అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే సమంత నయనతార మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కన్మణి రాంబో ఖతీజ అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇక నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా సమంత మాత్రం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.







