జోష్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన నాగచైతన్య సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ లేకపోతే డిజాస్టర్ అవుతున్నాయి.నాగచైతన్య సినిమాలు పలు సందర్భాల్లో నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తుండగా కొన్నిసార్లు మాత్రం భారీ మొత్తంలో నష్టాలను మిగుల్చుతూ షాకిస్తున్నాయి.
అయితే నాగచైతన్య పరశురామ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని గతంలో ప్రచారం జరిగిందనే సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో కస్టడీ మూవీలో నటిస్తున్న నాగచైతన్య పరశురామ్ సినిమాకు నో చెప్పారని సమాచారం అందుతోంది.
పరశురామ్ అదే కథతో విజయ్ దేవరకొండను ఒప్పించారని బోగట్టా.విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గీతా గోవిందం ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.బడ్జెట్ కలెక్షన్స్ తో పోల్చి చూస్తే టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో గీతా గోవిందం మూవీ కూడా ఒకటి.
8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు సాఫ్ట్ రోల్స్ లో కూడా విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించగలడని ఈ సినిమాతో ప్రూవ్ అయింది.విజయ్ కొత్త సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తే మాత్రం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.విజయ్ రష్మిక మధ్య ఏదో ఉందని తరచూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

విజయ్ రష్మిక కలిసి నటిస్తే ఆటోమేటిక్ గా ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.త్వరలో ఈ కాంబినేషన్ మూవీ గురించి మరికొన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది.చైతన్య వదులుకున్న కథతో విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ సక్సెస్ ను ఇస్తుందో చూడాల్సి ఉంది.







